కులానికే తొలి ప్రాధాన్యం

కులరహిత సమాజం, లౌకిక రాజ్యం అంటూ నేతలు ఎన్ని కబుర్లు చెప్పినా…కులం విషయంలో వారి వ్యవహార తీరు మాత్రం కులం విషయంలో వివక్షతోనే ఉంటున్నదనడానికి తాజా నిదర్శనం రాజస్థాన్ మంత్రి మమతా భూపేష్ మాటలే. రాజస్థాన్ లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకరాం చేసిన మమతా భూపేష్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రిగా అందరికీ న్యాయం చేయడం తన బాధ్యత అని చెప్పారు. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని చెబుతూనే ముందుగా తన కులంవారికే ప్రాధాన్యత నిస్తానని చెెప్పారు. రాజస్థాన్ కేబినెట్ లో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా మమతా భూపేష్ అన్న ఈ మాటలు వివాదానికి హేతువైంది. ఎంబీఏ చదివిన మమతా భూపేష్ అశోక్ గెహ్లాక్ కేబినెట్ లో ఏకైక మహిళ.