బ్యాగ్రౌండ్ అనేది వెండితెరపైన మాత్రమే కాదు బుల్లితెరపైన కూడా ఉంటుంది, కేవలం బ్యాగ్రౌండ్ ఉంటే – నటన రాకపోయినా ఇండస్ట్రీ లో కి రాణించేయవచ్చు అని అనుకునేవారందరికి సమాధానం ఇచ్చారు ‘కార్తీకదీపం’ సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు.
ఆయన ఒక ఇంటర్వ్యూలో ‘బ్యాగ్రౌండ్’ గురించి మాట్లాడుతూ, “అందరూ అనుకుంటారు నాకు యాక్టింగ్ రాదు, మా నాన్న గారి పేరు యూస్ చేసుకుని నేను ఇండస్ట్రీ లోకి వచ్చాను. బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టే ఛాన్స్‌లు ఇస్తున్నారు అని. ఆలా అనుకునేవారందరికి నా సమాధానం ఒక్కటే… ఒకవేళ వారు అనుకునేదే నిజమయితే నేను ఒకటి రెండు సీరియల్స్ చేసి కనుమరుగైపోయేవాడిని. ఇన్ని సీరియల్స్ ఆఫర్స్ యాక్టింగ్ రాని వాళ్లకి అయితే ఇవ్వరు కదా. యాక్టింగ్ రాకపోయినా పెట్టుకుని నన్ను భరించే అవసరం కూడా వాళ్లకి ఉండదు. నిజంగా నేను గోల్డెన్ స్పూన్ అయితే ఇలా కస్టపడి పనిచేసుకోవాలిసిన అవసరం ఉండేది కాదు. హ్యాపీగా ఏ టెన్సన్స్ లేకుండా సినిమాలు ప్రొడ్యుస్ చేసుకునేవాడిని.
అయితే, ఇండస్ట్రీ లో సక్సెస్ వెనుక కష్టం ఎలా ఉంటుందో, అలాగే రూమర్స్ కూడా ఉంటాయి. అందులో ఇది కూడా ఒక రూమర్ కావచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాగ్రౌండ్ అనేది ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. ఆ తరువాత కష్టపడి నిలదొక్కుకోవాలి. ఇక్కడ ఉన్న కాంపిటీషన్ లో టాలెంట్ ఉంటేనే నిలబడగలం. లేకపోతే బ్యాగ్రౌండ్ ఎందుకు పనికిరాదు. అలాగే ఇండస్ట్రీలో ఎదుటివారికి మనతో పని ఉంది అంటేనే ఎవరైనా మనతో ఉంటారు. అలాగే మా నాన్నగారు ఉన్న అన్ని రోజులే నా చుట్టూ అందరూ ఉన్నారు. ఆయన వెళ్ళిపోయాక ఇంక అవసరం లేదని వెళ్లిపోయారు” అంటూ తన మీద ఉన్న రూమర్స్ కి సమాధానం ఇచ్చారు నిరుపమ్ పరిటాల.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!