NewsOrbit
Featured జాతీయం ట్రెండింగ్

ఆమె ఒక‌ ప్ర‌భంజ‌నం.. 62 ఏళ్ల వ‌య‌సులో కూడా కోటి సంపాద‌న‌!

ఏదైనా చేయాల‌నే త‌ప‌న ఉంటే ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ల‌క్ష్యం దిశ‌గా అడుగులు వేస్తే.. విజ‌యం మ‌న సొంతం అవుతుంది అన‌డంలో సందేహం లేదు. దీన్ని ఎంతో మంది నిరుపించారు. దీనికి వ‌య‌సు, లింగ భేదాలు ఉండ‌వు. అచ్చం ఇలాంటి ఘ‌ట‌నే గుజ‌రాత్ లో జ‌రిగింది. ఈ ప్రాంతానికి చెందిన 62 యేండ్ల ఒక మ‌హిళ‌. పాల వ్యాపారాన్ని ప్రారంభించి అంద‌రూ ముక్కున వేలేసుకునేలా చేసింది. వ్యాపారం అంటే మాటాల్లో కాకుండా చేత‌ల్లో చూపిస్తూ.. ఔరా అనిపించింది.

గుజరాత్‌లో బనస్కాంత జిల్లాలోని నాగానా గ్రామానికి చెందిన చౌదరి నవల్‌బెన్‌ దల్సంగ్‌బాయ్‌(62) ఏడాదిలో అక్ష‌రాల‌ రూ. 1కోటి 10లక్షల విలువైన పాలను విక్రయించింది. దాంతో గుజరాత్‌లో కొత్త రికార్డును నెలకొల్పింది. అయితే ఈ మ‌హిళ నిరక్షరాస్యురాలు. ఈ మహిళ ద‌గ్గ‌ర‌ 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి. వీటితో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి అటు ఇటుగా వెయ్యి లీటర్ల పాలను ఆమె అమ్ముతుంది. రెండేళ్లలో నవల్‌బెన్‌కు బనస్కాంత జిల్లాలో 2 లక్ష్మి అవార్డులు, 3 ఉత్తమ పశుపాలక్‌ అవార్డులు సైతం వ‌చ్చాయి.

గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డులను తీసుకుంది. నవల్‌బెన్‌ డెయిరీలో 11 మంది పని చేస్తారు. పాల వ్యాపారంలో విప్ల‌వాన్ని సృష్టిస్తున్న ఈ మహిళకు నలుగురు కొడుకులు ఉన్నారు. ఏదైనా చేయ‌గ‌ల‌ము అనే ప‌ట్టుంటే దేనైనా సాధించ‌గ‌ల‌మ‌ని ఈ మ‌హిళ చెబుతోంది. పెద్ద‌పెద్ద కంప‌నీల్లో ప‌ని చేసే వారుకూడా ఈమె అంత సంపాధించ‌లేరు అన‌డంలో సందేహం లేదు. కానీ ఈ విజ‌యం వెనుక ఆ ప‌ట్టుద‌ల‌, కృషి మాత్రం చాలా ఉంద‌ని చెప్పొచ్చు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju