బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లటం పై షాకింగ్ కామెంట్స్ చేసిన నోయల్..!!

బిగ్ బాస్ హౌస్ లో స్టార్టింగ్ లో టాప్ కంటెస్టెంట్ గా ఆడియన్స్ దృష్టిలో పడిన వారిలో నోయల్ ఒకరు. పైగా సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండ్ కావడంతో నోయల్ హౌస్ లో బాగా రాణిస్తారు అని అందరూ భావించారు. కానీ అనారోగ్య రీత్యా బిగ్ బాస్ హౌస్ నుండి నోయల్ ఎలిమినేట్ అవ్వటం అందరికీ తెలిసిందే.

Bigg Boss Telugu 4 preview: Noel Sean demands an apology from Bigg Boss;  says he wants to quit - Times of Indiaఅయితే బయటకు వచ్చిన నోయల్ సోషల్ మీడియాలో అనేక ఇంటర్వ్యూ ఇస్తూ.. హౌస్ నుండి బయటకు వచ్చే వేదికపై తన సపోర్ట్ అభిజిత్, హారికా కి ఉంటుందని స్పష్టం చేయడం మాత్రమే కాక ప్రస్తుతం సపోర్ట్ చేస్తూ కూడా ఉన్నారు. అయితే ఇటీవల సిటీ నుండి చాలా దూరం గా బ్రతుకు తున్న నోయల్ ని హారిక బ్రదర్ వంశీ యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా నోయల్ మాట్లాడుతూ బిగ్ బాస్ షో కి అనవసరంగా వెళ్లినట్లు, తనకి అవసరంలేని షో అని బయటకు వచ్చాక ఎందుకు వెళ్లాను అని అనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. తన సపోర్ట్ హారిక, అభిజిత్ లకే చివరి వరకు ఉంటుందని స్పష్టం చేశారు. వాళ్లే విన్ కావాలని కోరుకుంటున్నట్లు నోయల్ చెప్పుకొచ్చాడు. మనుషులను ఎంత ఇష్టపడితే అంత దూరంగా ఉండాలని, దగ్గరగా ఉంటే సమస్యలు వస్తాయని తాను సిటీకి దూరంగా ఉంటున్నట్లు నోయల్ ఇంటర్వ్యూలో తెలిపారు. గేమ్ లో టైటిల్ విన్ అవ్వడం కోసం హారిక బాగా కష్టపడుతుంది అని.. ఎలాంటి ట్రాకులు లేకుండానే హారిక ఆ విధంగా కష్టపడటం నిజంగా గ్రేట్ అంటూ తన సపోర్ట్ హారికా కి చివరి వరకు ఉంటుందని నోయల్ కామెంట్లు చేశారు.