NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

panchayat raj : ఆ కొత్త జీవో పరిణామం ..! రెవెన్యూ, పిఆర్ శాఖల మధ్య వార్ ..! మంత్రి పెద్దిరెడ్డి ఎమంటారో..?

panchayat raj : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలన్న సంకల్పంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు, వెల్పేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, సర్వేయర్, మహిళా పోలీస్, విఆర్ఓ తదితర పోస్టులతో పాటు వాలంటీర్లతో కలిపి దాదాపు 4 లక్షల మందిని విధుల్లోకి ప్రభుత్వం తీసుకున్నది. వీరంతా ఇప్పటి వరకూ పంచాయతీ రాజ్ శాఖ కింద విధులను నిర్వహిస్తున్నారు. వీరికి డ్రాయింగ్ డిస్ బర్స్ మెంట్ అఫీసర్ (డీడీఓ) గా పంచాయతీ కార్యదర్శులు (ఇఓ)లు వ్వహరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అనేక రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడంతో ప్రజలు మండల తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని తప్పింది.

Panchayat raj employees protest
Panchayat raj employees protest

అయితే ప్రభుత్వం తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి డీడీఓ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులను తొలగించి రెవెన్యూ శాఖ పరిధిలోని విఆర్ఓకు అప్పగిస్తూ జివో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పంచాయతీ రాజ్ ఉద్యోగులు తప్పుబడుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల మధ్య ఇది చిచ్చు రేపుతోంది. డీడీఓలుగా విఆర్ఓలను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పంచాయతీరాజ్ శాఖ బలహీనం కావడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దారి తప్పే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఏపి పంచాయతీ రాజ్ సర్వీస్ అసోసియేషన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తోంది. ఈ జివో రద్దు చేయాలని కోరుతూ పలు జిల్లాలలో పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం నేతలు ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Panchayat raj employees protest
Panchayat raj employees protest

ప్రకాశం జిల్లాలలో అయితే విఆర్ఓ, కార్యదర్శుల సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఘర్షణ కూడా పడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో మీరు అవినీతి పరులంటే..కాదు మీరే అవినీతి పరులు అంటూ విఆర్ఒ, గ్రామ కార్యదర్శులు ఒకరి నొకరు దూషించుకున్నారు. ఇప్పటికే విఆర్ఓ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయి ఉండగా వారికి డీడీఓ అధికారం ఇవ్వడం ఏమిటంటూ కార్యదర్శుల సంఘం నేతలు బహాటంగా విమర్శించారు. కార్యదర్శుల సంఘం నేతలపై విఆర్ఓల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులే అవినీతిపరులంటూ విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N