రిషభ్ పంత్ సెంచరీ

సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రిషభ్ పంత్ సెంచరీ కొట్టాడు. 146 బంతుల్లో 6 ఫోర్లతో 104 పరుగులతో ఆడుతున్నాడు. మరో ఎండ్ లో జడేజా 37 పరుగులతో ఆడుతున్నాడు. భారత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 519 పరుగులు.

దీంతో సిడ్నీ టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 303/4 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించింది. ఈ రోజు ఆటలో పుజారా లంచ్ తరువాత కొద్ది సేపటికి 193 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయితే రిషభ్ పంత్ ధాటిగా ఆడుతూ తాను సెంచరీ చేయడమే కాకుండా భారత్ స్కోరును 500 పరుగులు దాటించాడు. అదే విధంగా జడేజా కూడా వేగంగా స్కోరు చేస్తున్నాడు.