చైనా మాటలకు మోడీ చేతలేవి..? నిజం దాస్తున్నది ఎవరు? 

Share

గల్వాన్ లోయలో జరిగిన ఘటనలో చైనా నుండి భారత ఆర్మీ క్యాంపు లోనికి గాని భారత సరిహద్దుల్లో కి గాని ఎవరూ చొరబడనేలేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా చైనా వారికి సరైన సమాధానం చెబుతామని…. భారతదేశం సార్వభౌమాధికారమే వారి ప్రధాన లక్ష్యమని బీరాలు పలికిన ఆయన ప్రస్తుతం చైనా చేస్తున్న వాదనలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయిపోవడం గమనార్హం.

PM Narendra Modi, a silent film

ఇటుపక్క చైనావారు చూస్తుంటే గల్వాన్ లోయలో లో జరిగిన ప్రతి ఒక్క దానికి బాధ్యత భారతదేశానిదే అని అనేసింది. అయితే గల్వాన్‌ వ్యాలీ ఘర్షణలో పొరపాటు భారత్‌దేనని, భారత సైనికులు తమ దేశ పరిధిలోకి చొరబడ్డారని, గాల్వన్‌ యావత్తు తమ ఆధీనంలోనే ఉందని తేల్చి చెప్పారు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిజియన్‌. 

భారత దళాలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలు చేపట్టారని, అక్కడున్న యథాతథ స్థితిని చెడగొట్టాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చావో లిజియన్‌ చెప్పుకొచ్చారు. వీటిని ఎదుర్కోడానికి చైనా సైన్యం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందని, తమ భూమిని కాపాడుకోవడానికి చొరబడి వచ్చిన భారత సైనికులతో బాహాబాహీకి దిగాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. 

ఇలా చైనా ఇచ్చిన స‌మ‌ర్థ‌వంత‌మైన వివ‌ర‌ణ  ఏ మీడియా కూడా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయారు (అది నిజం కానివ్వచ్చు.. అబద్ధం కానివ్వచ్చు). చైనా త‌న వాణిని నిజ‌మ‌ని న‌మ్మించేలా బ‌లంగా వినిపించింది… అది ఎక్కడా చూపించ‌ట్లేదు.

మోదీ చైనాకు స‌మ‌ర్ధ‌వంత‌మైన వివ‌ర‌ణ లేదా కౌంట‌ర్ ఎందుకు ఇవ్వ‌లేక‌పోతున్నార‌న్న అంశాన్ని ఎవ్వ‌రూ బ‌లంగా ఎత్తుకోవ‌డం లేదు.. లేదా ఏదైనా రాజ‌కీయ ప్ర‌యోజం ఉందా.. ఇక జాతీయ మీడియా అంతా మోడీ క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తుంది అన్న వాదనలకు బలం చేకూర్చేలా ఇక్క‌డ బీజేపీకి వ్య‌తిరేకంగా ఉండే ఏ అంశం కూడా హైలెట్ కావ‌డం లేదు. 

భారత్ చైనాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. వివాదాస్పదమైన హిమాలయ ప్రాంత సరిహద్దు యుద్ధానికి మూల కారణంగా చెప్పుకున్నప్పటికీ ఇతర సమస్యలు కూడా దోహదమయ్యాయి అన్నది వాస్తవం. మరి అసలు ఇక్కడ నిజం దాస్తున్నది ఎవరు? సరైన స్పష్టత ఇవ్వవలసింది ఎవరు?

 


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 7th సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

బిగ్ బాస్ 4 : నిన్నటిదాకా టైటిల్ ఫేవరెట్ లు… ఈ రోజు ఎలిమినేషన్ డేంజర్ లో పడ్డారు!

arun kanna

తాళజ్ఞాని

somaraju sharma