దిల్ రాజు నిర్మాణంలో తమిళ సూపర్ హిట్ 96 కి రీమేక్ గా తెరకెక్కిన జాను సినిమాలో నటించింది సమంత. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ దెబ్బతో సమంత మళ్ళీ ఒక్క సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఓ బేబీ..మజిలీ సినిమాలతో సంపాదించుకున్న క్రేజ్ మొత్తం ఒక్క జాను పట్టుకెళ్ళిపోయింది. పాపం ఈ హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్న సమంత ఆశలన్ని బూడిదలో పోసిన పన్నీరు లా అయిపోయాయి.
అయితే మొదటిసారి వెబ్ సిరీస్ కి ఒకే చెప్పి అందరికీ షాకిచ్చింది. అది కూడా నెగిటివ్ రోల్ లో. సమంత సినిమాలు మొదలు పెట్టినప్పటినుంచి చేస్తున్న ఫస్ట్ నెగిటివ్ రోల్ మీద అభిమానులకి భిన్న అభిప్రాయాలున్నాయి. సకస్ ఫుల్ ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా ఫ్యామిలీ మాన్ సీజన్ 2 రూపొందుతుంది. ఈ వెబ్ సిరీస్ లోనే సమంత నటించింది. ఇప్పటికే సమంత మీద చిత్రీకరించాల్సిన సన్నివేశాలను పూర్తి చేశారు. ప్రియమణి మనోజ్ వాజ్ పాయి ప్రధాన పాత్రలు పోషొస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం సమంత దగ్గరికి ఒక భారీ పాన్ ఇండియా రేంజ్ స్క్రిప్ట్ వచ్చిందట. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నాలుగు ప్రధాన భాషల్లో నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా సమంత చుటూ కథ తిరిగేలా ఈ సినిమా ఉండబోతుందట. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ చేస్తారట. మిగతా విషయాలు త్వరలో అధికారకంగా వెల్లడి కానున్నాయని సమాచారం. ఇక తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా కమిటయిన సమంత లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లో జాయిన్ కానుందట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!