NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప్ర‌కాశం వైసీపీ లీడ‌ర్‌ యూట‌ర్న్‌.. సొంత కొంప‌కు సెగ పెట్టే ప‌ని చేశారే…!

ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన జూపూడి ప్ర‌భాక‌ర్ ఇటీవ‌ల కాలంలో చేస్తున్న వ్యాఖ్య‌లు.. తాడేప‌ల్లిలో చ‌ర్చ‌నీయాంశం అయిన‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌న‌వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గానే తీసుకోవాల‌ని.. కీల‌క నాయ‌కులు ఆదేశించిన‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల ఓ నిండు స‌భ‌లో జూపూడి మాట్టాడుతూ.. సాక్షిపేప‌ర్‌పై విమ‌ర్శ‌లు చేశారు. `సాక్షి పేప‌ర్‌లో ప్ర‌జ‌ల‌సొమ్ముతో ఇంత పెద్ద ప్ర‌క‌ట‌న ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉంటుందో పోతుందో తెలియ‌దు. ఈ విష‌యాన్ని ఆలోచించండి` అని వ్యాఖ్యానించారు.

Prakasam YCP leader Uturn.
Prakasam YCP leader Uturn.

ఇది ఆయ‌న ఏ యాంగిల్‌లో అన్నారో తెలియ‌దు కానీ.. పార్టీలో మాత్రం హీటెక్కించింది. ఇక‌, తాజాగా మ‌చిలీపట్నంలో మాట్లాడుతూ.. కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వైపు ఎస్సీ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న‌జూపూడి దానికి ప‌నికి వ‌చ్చేలా.. ప‌నిచేయాలి. కానీ, ఆయ‌న మ‌చిలీప‌ట్నంలో మాట్లాడుతూ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. పార్టీని డ్యామేజీ చేసేలా వ్య‌వ‌హ‌రించార‌ని నేత‌లు అంటున్నారు.

`మాకు డ‌బ్బులే ముఖ్యం. ఎస్సీల ఓట్లే ముఖ్యం. అంబేడ్క‌ర్ త‌ర్వాతే` అని జూపూడి అన్నారు. ఎందు కంటే.. విదేశీ విద్యాదీవెన పేరుతో ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు సొమ్ములు ఇస్తోంది. అయితే.. ఈ ప‌థ‌కాన్ని జ‌గ‌న‌న్న విదేశీ విద్యాదీవెన‌గా మార్చారు. దీనిపైనే జూపూడి మాట్లాడుతూ.. ఎస్సీల‌కు ఏం కావాలి.. డ‌బ్బులు. ఇదే క‌దా.. ప్ర‌భుత్వం చేస్తోంది. అంబేడ్క‌ర్ గురించి మాకెందుకు? ఆయ‌న పేరు తీసేసేలా కూడా నిర్ణ‌యాలు ఉండొచ్చు! అని అన్నారు. ఇది.. ఎస్సీసామాజిక వ‌ర్గం నేత‌ల్లో ఆగ్ర‌హానికి దారితీసింది.

Prakasam YCP leader Uturn.
Prakasam YCP leader Uturn.

దీంతో వైసీపీ ప్ర‌భుత్వం విజ‌య‌వాడ‌లో నిర్మించిన నిలువెత్తు అంబేడ్క‌ర్ విగ్ర‌హం కూడా..జూపూడి వ్యాఖ్య‌ల‌తో చిన్న‌బుచ్చుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా జూపూడి ఎందుకు యూట‌ర్న్ అయ్యారు. ఆయ‌న‌ ఎందుకు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే చ‌ర్చను ప‌రిశీలిస్తే.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొండ‌పి లేదా.. తిరువూరు టికెట్ల‌ను ఆశించారు. కానీ, పార్టీ ఇవ్వ‌లేదు. దీంతో ఇలా.. పార్టీలోనే ఉంటూ.. పార్టీకి సెగ‌బెడుతున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో ఉంటూ.. ఇలానే చేశార‌నిప‌రిశీల‌కులు గుర్తు చేస్తున్నారు.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?