పోలీసులకు పదోన్నతులు

అమరావతి, డిసెంబర్ 31 : రాష్ట్రంలో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరి రోజున తీపి కబురు అందించబోతున్నది. పదోన్నతులు అందుకున్న వారంతా జనవరి 1న కొత్త హోదాలో విధులు నిర్వహించనున్నారు.

2019 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా, 566మంది హెడ్ కానిస్టేబుళ్లు ఎఎస్‌ఐలుగా, ఇంకా పలువురు ఎస్‌ఐలు, సిఐలు పదోన్నతులు పొందనున్నారు. అలాగే 45మంది డీఎస్‌పీలు అడిషనల్ ఎస్‌పీలుగా, ఎస్‌పీలుగా పదోన్నతి పొందుతున్నారు. వీరంతా జనవరి 1న కొత్త హోదాలో బాధ్యతలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని వాహనాలు లేని పోలీస్ స్టేషన్‌లకు జీపులు, బైక్‌లు, అధునిక కార్లను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందించనున్నారు