ఆ సీనియర్ హీరో కి ఎలాగైనా హిట్ ఇవ్వాలని డిసైడ్ అయిన పూరి జగన్నాథ్..??

వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత ఏడాది “ఇస్మార్డ్ శంకర్” సినిమా తో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మళ్లీ పూరి ఐ యాం బ్యాక్ అనే రీతిలో హిట్ ట్రాక్ లో పడటంతో…గతంలో మాదిరిగానే పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ త్వరలోనే ఇండస్ట్రీలో ఓ సీనియర్ హీరోతో సినిమా చేసి ఆయనకి భారీ హిట్ ఇవ్వాలని తెగ తాపత్రయ పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.

Exclusive: Puri To Direct Balakrishna NTRపూర్తి విషయంలోకి వెళితే నందమూరి నటసింహం బాలయ్య బాబు తో మరోసారి పూరి జగన్నాథ్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సరిగా ఆడకపోవడంతో సినిమా నందమూరి అభిమానులను నిరుత్సాహానికి గురి చేయడంతో… ఈసారి ఎలాగైనా బాలయ్యకి భారీ హిట్ ఇవ్వాలని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డిసైడ్ అయినట్లు టాక్.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ అంతా ఓకే చేసినట్లు త్వరలోనే బాలయ్యతో చర్చించి పూరి కథ చెప్పే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో “ఫైటర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని పూరి చెప్పడంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.