బాబా అణు పరిశోధనా కేంద్రం భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అణు పరిశోధనా సంస్థ ఇది.. అణుశక్తిని ప్రధానంగా మానవాళి మేలు కొరకు ఉపయోగించడానికి ఈ సంస్థ విస్తృతంగా ప్రయోగాలు చేస్తుంటుంది.. విద్యుత్ ఉత్పత్తే బార్క్ ముఖ్య ఉద్దేశం.. అణు శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం,ఆధునిక పరికరాలు ఇందులో ఉన్నాయి.. ఇందులోభాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి భౌతిక రసాయన జీవ శాస్త్ర రంగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జెఆర్ఎఫ్) ను అందిస్తుంది..! పూర్తి సమాచారం ఇలా..
మొత్తం ఫెలోషిప్ ల సంఖ్య: 105
విద్యార్హతలు :
ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లో ఉత్తీర్ణత. బీఎస్సీలో కనీసం 60% మార్కులు , ఎమ్మెస్సీలో 55% , ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, బిఎస్సి, ఎంఎస్ లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి.
వయసు : 28 ఏళ్ళు లోపు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
జస్ట్ స్కోర్, ఐసిఎంఆర్ జెఆర్ఎఫ్ టెస్ట్, ఐకార్ జెఆర్ఎఫ్ టెస్ట్, dbt జెఆర్ బి బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ , గేట్ స్కోర్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఎంపికైతే :
మొదటి రెండు సంవత్సరాలకు నెలకు రూ.31000,ఉచిత వసతి. వసతి కల్పించకపోతే హెచ్ఆర్ఎ రూ.7440 అదనంగా ఇస్తారు. ప్రతిభ కనబరిస్తే ఫెలోషిప్ గడువు పెంచుతారు. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) కింద మూడో సంవత్సరం నుంచి స్టైఫండ్ రూ.35,000, హెచ్ఆర్ఎ రూ.8,400 చెల్లిస్తారు. వీటితో పాటు కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి 40 వేలు చెల్లిస్తారు. మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఇస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 500/-. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరంలేదు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
వెబ్సైట్ : https://recruit.barc.gov.in
దరఖాస్తులకు చివరి తేదీ :15/1/2021.