NewsOrbit
న్యూస్

కేసీఆర్ కేబినెట్ లోనే చిచ్చుపెట్టిన రేవంత్… ఒక్క మాటతో కల్లోలం!

నిత్యం తన మాటలతో, తన చేష్టలతో, తనదైన దూకుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే రేవంత్ రెడ్డి… ఈ సారి ఏకంగా కేసీఆర్ కేబినెట్ నే టార్గెట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కేబినెట్ ను అల్లకల్లోలం చేసే మాటలు మాట్లాడారు. అయితే… రేవంత్ రెడ్డి అన్న మాటలను కేవలం రాజకీయ విమర్శలగానో లేక కేసీఆర్ పై ఉన్న కోపం తోనో చేసిన కామెంట్లుగానే చూడకూడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో చాలా అర్ధమే దాగుందనేది వారి అభిప్రాయం!

వివరాళ్లోకి వెళ్తే… కరోనా పేరుచెప్పి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విషయంలో కేసీఆర్ అసమర్ధతకు, చేసిన తప్పులకు… తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బలిపశువును చేయబోతున్నారని రేవంత్ బాంబు పేల్చారు. దీంతో మరోసారి ఈటెలకు నిద్రలేని పరిస్థితి నెలకొందట. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రి కావడంతో ఈటల ఆ హోదా పరపతి అనుభవించాడు. అయితే రెండోసారి గద్దెనెక్కాక ఈటలను కాస్త దురదృష్టం వెంటాడుతోందనే అనాలి. కేసీఆర్ తో విభేదాలు తలెత్తడం.. ఈటలను అసలు మంత్రివర్గంలోకే తీసుకోరని చర్చ జరగడం తెలిసిందే.

ఈ క్రమంలో ఈటల లీకులు ఇస్తున్నాడని, సరిగ్గా పనిచేయడం లేదని టీఆర్ ఎస్ అనుకూల పత్రికలో కథనాలు కూడా గతంలో వచ్చాయి. ఆయనను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తీసేస్తున్నారంటూ ప్రచారం సాగింది. దంతో… కేసీఆర్ సరైన సమయం కోసం చూస్తున్నారని అంతా భావించారు! ఆ మాటలకు బలంం చేకూర్చేల ఈటల హయాంలోనే డెంగ్యూ – చికెన్ గున్యా ప్రబలి చాలా మంది మరణాలు సంభవించాయి. దీంతో… ఈటల అసమర్థత అంటూ ప్రచారం జరిగింది. అనంతరం తెలంగాణ లో ఈఎస్ఐ కుంభకోణం, మందుల కొనుగోళ్లలో అవకతవకల వ్యవహారం రావడంతో ఈటలను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే చర్చ కూడా సాగింది.

ఈ దెబ్బలు చాలవన్నట్లు తాజగా కరోనా రూపంలో ఈటలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో దీనికి బాధ్యుడిని చేసి ఈటల మంత్రి పదవిని తీసేయబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… వాటికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు మరింత బలాన్ని పెంచాయి! చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి మద్దతుగా తాజాగా దీక్షలు చేస్తున్న జర్నలిస్టుల వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటలను కరోనా వైఫల్యం పేరుచెప్పి పీకేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో… కేసీఆర్ కేబినెట్ లోనే రేవంతి చిచ్చుపెట్టినట్లు అయ్యిందని అంటున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N