మ‌నంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్ …మోదీజీ సంచ‌ల‌న నిర్ణ‌యం

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఒకే స‌మ‌యంలో విభిన్న ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండ‌గా మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పంజా విసురుతున్నాయి.

 

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 40 వేలకు పడిపోయినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కలవరపెడుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మోదీజీ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా వ్యాక్సిన్ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అఖిలపక్ష సమావేశానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సమాశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే, ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు సమాచారం చేరవేసినట్టుగా తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో కోవిడ్ పరిస్థితి, వివిధ రంగాలపై కోవిడ్‌ ప్రభావాన్ని చర్చించడంతో పాటు.. తాజాగా, కోవిడ్ వ్యాక్సిన్‌పై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సమావేశంలో వ్యాక్సిన్‌ ఎప్పుడు వచ్చేఅవకాశం ఉంది అనేదానిపై, అలాగే వ్యాక్సిన్ పంపిణీ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇతర కీలక అంశాలను.. ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించనున్నారు.

ఇప్ప‌టికే స‌మావేశం…

క‌రోనా మహమ్మారి నివారణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, త్వరలో అందుబాటులోకి రానున్న కొవిడ్ వ్యాక్సిన్ పై రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఏర్పాట్లు తదితర అంశాలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌభ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను తూచా తప్పక అమలు చేయాలని తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో 4.5 లక్షలు యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరణాల శాతం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాలలో నియంత్రణకు, కొవిడ్ పరీక్షలు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిoదని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాకు తీసుకుంటున్న చర్యలపై ప్రస్తావిస్తూ, కొవిడ్ వ్యాక్సిన్ ను సత్వరమే అందరికీ అందేలా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల్లో సమన్వయం చేసుకోగలరని సూచించారు. వ్యాక్సిన్ నిల్వ కోసం కోల్డ్ చైన్ గుర్తించడం, వ్యాక్సిన్ రవాణా తదితర అంశాలపై సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని తెలియజేశారు.