ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ వన్ విన్నర్ మామూలోడు కాదు.. ఆలీకే ఎలా పంచులు ఇచ్చాడో చూడండి?

shiva balaji and madhumitha in alitho saradaga show
Share

మీకు బిగ్ బాస్ వన్ విన్నర్ గుర్తున్నాడా? అదేనండి.. శివ బాలాజీ. చాలా సినిమాల్లో కూడా నటించాడు. ఆర్య సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ శివ బాలాజీ గురించే మనం మాట్లాడుకునేది. ఆయన ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కానీ.. బయట కానీ కనిపించడం లేదు కానీ.. ఆయన, తన భార్య మధుమిత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బిగ్ బాస్ మొదటి సీజన్ విజేతగా నిలిచాక కూడా ఆయనకు పెద్దగా ఆఫర్స్ అయితే రాలేదు. అందుకే ఆయన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఏదో అడపా దడపా కనిపిస్తున్నారు.

shiva balaji and madhumitha in alitho saradaga show
shiva balaji and madhumitha in alitho saradaga show

తాజాగా ఆయన ఆలీతో సరదాగా షోకు తన భార్య మధుమితతో పాటుగా గెస్ట్ గా వెళ్లారు. ఆలీతో సరదాగా షో అంటేనే.. ఆలీ పంచులు ఉంటాయి. వచ్చిన గెస్ట్ ల గురించి ముందే అన్నీ కనుక్కొని.. వాళ్ల పర్సనల్ విషయాలు కూడా తెలుసుకొని.. వాళ్లను ప్రేక్షకుల ముందు విసుగుపుట్టేలా ప్రశ్నలు వేస్తుంటారు ఆలీ.

కానీ.. ఈసారి మాత్రం శివ బాలాజీనే ఆలీకి చుక్కలు చూపించాడు. ప్రతి ప్రశ్నకు కౌంటర్ ఇస్తూ ఆలీని ఇరుకున పెట్టాడు. ఏమో అనుకున్నాం కానీ.. శివబాలాజీ మామూలోడు కాదు. ఆలీకి కూడా కొన్ని విషయాల్లో కౌంటర్ ఏసేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

అయితే.. ఈ షోలో శివబాలాజీ, తన భార్య మధుమిత గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ప్రోమో చూసేయండి.


Share

Related posts

Job Notification : నెహ్రూ యువ కేంద్ర సంగథాన్ లో భారీగా ఖాళీలు..

bharani jella

Niveda pethuraj : నివేదా పేతురాజ్ .. ప్రియాంక జవాల్కర్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా..?

GRK

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్… టిటిడిలో ఉద్యోగ అవకాశాలు

Vihari
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar