ఇంకా మూడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈసారి టైటిల్ విన్నర్ ఎవరు అనే దాని విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ నుండి హౌస్ లో భారీ స్థాయిలో ఓట్లు రాబట్టు కుంటుంది కంటెస్టెంట్ అభిజిత్. ఒక్కసారి కూడా హౌస్ లో కెప్టెన్ అవ్వకుండా చాలాసార్లు ఎలిమినేషన్ కి నామినేషన్ అయినా అభి తన ఆటతీరుతో.. చాలామందిని ఆకట్టుకోవటం జరిగింది.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో గ్యారెంటీగా టైటిల్ విన్నర్ అభి అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి తెలుగులో బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుంది ఎక్కువశాతం అబ్బాయిలే కాబట్టి ఈసారి అమ్మాయికి దక్కాలని షో నిర్వాహకులు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే ఈ షోలో ఫిమేల్ కంటెస్టెంట్ అరియనా ని ఈసారి గెలిపించాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఓటింగ్ పరంగా కాకుండా వేరే కోణంలో షో నిర్వాహకులు ఆమెకు టైటిల్ వచ్చేలా ప్లాన్లు వేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. ఇదే జరిగితే కనుక అభిజిత్ ఫ్యాన్స్ నుండి బిగ్ బాస్ షో నిర్వాహకుల పై భారీ స్థాయిలో వ్యతిరేకత రావడం గ్యారెంటీ అని బయట జనాలు సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. ప్రేక్షకులు ఓటింగ్ పరిగణనలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వచ్చే సీజన్లకు ఎలాంటి ఆదరణ లభించదని కూడా చెబుతున్నారు.