Bigg Boss 5 Telugu: ఎట్టకేలకు ఆ విషయంలో షణ్ముక్ పై రివేంజ్ తీర్చుకున్న సిరి..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. ఎక్కువ స్క్రీన్ స్పేస్ షణ్ముక్(Shanmuk).. సిరి(Siri)కి లభిస్తోంది. వీరిద్దరి ఫ్రెండ్ షిప్ తో పాటు వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవలు.. చూసిన ఆడియన్స్ కి ఎంతగానో కిక్ ఇస్తున్నాయి. ప్రారంభం నుండి షణ్ముఖ్ జస్వంత్ కి గేమ్ పరంగా ఎంతో సపోర్ట్ చేస్తూ …లో లో… ఉన్న సమయంలో అండగా ఉంటూ సిరి అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఒక పక్క తన గేమ్ ఆడుతూ ఉంటే మరోపక్క షణ్ముక్ కి అండగా ఉంటూ కొన్ని విషయాలలో చాలా సపోర్ట్ గా నిలుస్తూ వస్తుంది. షణ్ముఖ్ జస్వంత్ 8వ వారం కెప్టెన్ అవ్వడానికి గల కారణాలలో సిరి ప్రధాన కారణమని చెప్పవచ్చు. గోనె సంచులలో ఉండి ధర్మకోల్ బాల్స్.. టాస్క్ లో చివరి నిమిషంలో సిరి పెద్దగా షణ్ముక్ తో గొడవ పడకుండా… చేతులెత్తేసి.. అతని గెలవడానికి కారణం అయ్యింది.

ఏదో ఒకరోజు ఇంటికి కెప్టెన్ అవుతాను

కానీ షణ్ముక్ కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో ప్రతి ఒక్కరి తో ఒకేలాగా.. వ్యవహరించి 8వ వారం లో తన గ్రూపు అనబడే సిరి, జేస్సీ(Jessy)తో చాలా కఠినంగా డీల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో బాల్ తో.. కొట్టే సమయంలో సిరి ని టార్గెట్ చేసుకుని షణ్ముఖ వేసిన బంతులు.. అదే రీతిలో నిద్ర పోయిన సమయంలో… స్పూన్ తో స్విమ్మింగ్ పూల్ దగ్గర కప్పులోకి నీళ్లు పోసేలా షణ్ముక్… సిరికి పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో కచ్చితంగా నేను ఏదో ఒకరోజు ఇంటికి కెప్టెన్ అవుతాను ఇదే రీతిలో నిన్ను ఏడిపించి .. నాకు ఇచ్చిన సేమ్ పనిష్మెంట్ నీకు ఇస్తాను.. అంటూ షణ్ముక్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ (Bigg Boss)హౌస్ లో బీబీ స్టార్ హోటల్ కెప్టెన్సీ టాస్క్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో వైటర్ గా  షణ్ముఖ్ జస్వంత్ ఉండగా… పెద్ద డాన్ కూతురిగా.. సిరి ఆడుతోంది. అయితే షణ్ముఖ్  తన కెప్టెన్సీ టాస్క్ లో టి -స్పూన్ తో స్విమ్మింగ్ పూల్ దగ్గర చేయించిన పనిష్మెంట్ నీ… ఈ బీబీ హోటల్ టాస్క్ లో.. వెయిటర్ షణ్ముక్ కి… హోటల్ కస్టమర్ గా.. వచ్చిన శిరి(Siri) తనకి సరిగ్గా సర్వ్  చేయలేదని… షణ్ముక్(Shanmukh) కి  పనిష్మెంట్ ఇచ్చి తన రివేంజ్ తీర్చుకుంది.

బాగా బలుపు ఎక్కువైపోయింది

ఈ క్రమంలో షణ్ముక్ నామినేషన్ లో  చూసుకుందాం అంటూ సరదాగా.. సిరికి పాట రూపంలో డైలాగ్ వేయడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే షణ్ముఖ్ కెప్టెన్గా ఉన్న సమయంలో తనకి ఇచ్చిన పనిష్మెంట్ తిరిగి సిరి ఈ హోటల్ టాస్క్ లో.. షణ్ముక్ కి ఇచ్చి… తనదైన శైలిలో రివేంజ్ తీర్చుకుంది. ఇదిలా ఉంటే వైటర్ గా షణ్ముఖ్…టిప్ కోసం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో గేమ్ లో… మిగతా ఇంటి సభ్యుల పై.. తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా కాజల్ అతిథుల టీం లో ఉండటంతో.. ఆమె వ్యవహరిస్తున్న తీరు తో పాటు సర్వీస్.. చేయించుకొని టిప్ ఇవ్వకుండా గేమ్ ఆడుతూ ఉండటంతో.. బాగా బలుపు ఎక్కువైపోయింది..అంటూ.. కాజల్ పై.. షణ్ముక్ డైలాగులు వేయడం జరిగింది. అదేవిధంగా కాజల్ హోటల్ సిబ్బందితో తనదైన శైలిలో ఆడుకుంటూ ఉంది. షణ్ముఖ చేత కుప్పిగంతులు వేయడంతోపాటు.. రక రకాల సర్వీసులు చేయించుకుంది. సింగర్ శ్రీరామ్(Sri Ram) నీ.. కూడా టార్గెట్ చేసుకుని మరీ ఏడిపించింది. సిరి(Siri) కూడా శ్రీరామ్ కి.. పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకానొక సమయంలో శ్రీరామ్ పాట పాడితే షణ్ముఖ్ డాన్స్ వేయాలి అనే టాస్క్.. సిరి ఈ బిబి హోటల్ టాస్క్ లో.. ఇచ్చి వారితో డాన్స్ వేయించారు. మొత్తంమీద బీబీ హోటల్ టాస్క్ లో.. కంటెస్టెంట్ లు ఎవరికి వారు రెచ్చిపోతున్నారు.


Share

Related posts

Suspicious Death: నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం..! ముగ్గురు బాలికలు అనుమానాస్పద మృతి.. ! విషయం ఏమిటంటే..!!  

somaraju sharma

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య వంట వండితే మామూలుగా ఉండదు?

Varun G

ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సస్పెన్స్

Siva Prasad