NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సోషల్ మీడియా పవర్ అంటే అది.. ఆ తాత జీవితం ఎలా మారిపోయిందో చూడండి

social media changed old man life overnight

సోషల్ మీడియా.. క్షణాల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వాలన్నా.. ఓవర్ నైట్ స్టార్ అవ్వాలన్నా.. ఇంకా ఏదైనా చేసేయొచ్చు సోషల్ మీడియాతో. అది చాలా పవర్ ఫుల్లు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామనేది మన చేతుల్లో ఉంటుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి బ్రహ్మాండమైన అస్త్రం అది. ఎవరికైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలన్నా.. దేన్నయినా ఫేమస్ చేయాలన్నా.. ఇలా ఏ పనైనా సోషల్ మీడియా ద్వారా ఈజీగా అయిపోతుంది. కోట్ల మందికి మన అభిప్రాయాలను తెలపొచ్చు.

social media changed old man life overnight
social media changed old man life overnight

తాజాగా సోషల్ మీడియా వల్ల ఓ తాత జీవితం ఓవర్ నైట్ లో మారిపోయింది. కాంతా ప్రసాద్ అనే తాత గురించే మనం మాట్లాడుకునేది. ఆయన వయసు 80 ఏళ్లు. బతకడానికి బాబా కా దాబా అనే చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. 30 ఏళ్ల కింద పెట్టిన హోటల్ అది. తనకు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆయనను పట్టించుకోవడం మానేశారు. దీంతో ప్రసాద్, ఆయన భార్య.. ఇద్దరు కలిసి చిన్న హోటల్ ను నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే కరోనా వల్ల పరిస్థితులు ఒక్కసారిగా ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే కదా. కాంతా ప్రసాద్ హోటల్ పరిస్థితి కూడా అంతే. రూపాయి గిరాకీ లేక ఆయనకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులూ ఎక్కువయ్యాయి. ఆ పని కాకుండా ఇంకో పని చేసే పరిస్థితుల్లో ఆయన లేడు. పిల్లలు ఆదుకోవడం లేదు. ఏం చేస్తాం.. అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు ప్రసాద్.

అయితే.. ఓ రోజు ఓ వ్యక్తి కాంతా ప్రసాద్ హోటల్ కు వచ్చి.. ఫుడ్డు తిన్నాడు. 80 ఏళ్ల వయసులో హోటల్ ను నడుపుతున్న ఆయన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావు. మరి.. గిరాకీ ఉంటోందా? అని ప్రసాద్ ను అడిగాడు. దీంతో ప్రసాద్ బోరుమన్నాడు. తన గల్లపెట్టె చూపించాడు. అందులో 10 రూపాయల నోటు తప్పితే చిల్లర కూడా లేదు.

దీంతో ఆ తాతా బాధ ఆ వ్యక్తికి అర్థం అయింది. వెంటనే ఫోన్ తీశాడు. తాత బాధను వీడియో తీశాడు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ హోటల్ లో ఫుడ్డు బాగుంటుందని.. అందులోనూ తక్కువ ధరకే మంచి ఫుడ్డును ఇక్కడ పొందొచ్చని.. పెద్ద పెద్ద హోటళ్లలో వేలకు వేలకు పెట్టి తినే బదులు.. వంద లోపే పెట్టి ఇక్కడ బ్రహ్మాండమైన ఫుడ్డును ఆరగించవచ్చంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో తెలిపాడు. ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ దాబాకు వచ్చి ఇక్కడి ఫుడ్డు రుచి చూడాలంటూ ఆ వ్యక్తి కోరాడు.

అయితే.. ఆ వీడియో ఓవర్ నైట్ లో ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే దగ్గర్లోని స్థానికులు ఆ తాత హోటల్ కు వచ్చి అక్కడి ఫుడ్డును రుచి చూడటం మొదలు పెట్టారు. అంతే.. ఆ హోటల్ కు కస్టమర్ల గిరాకీ పెరగడంతో తాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతక ఈ హోటల్ ఎక్కడ ఉందో చెప్పనేలేదు కదూ.. ఢిల్లీలోని మాల్వియా నగర్ లో.

author avatar
Varun G

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N