సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సోహెల్.. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. అలాగే మెహబూబ్ కూడా అంతే. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాకనే వీళ్లెవరు.. వీళ్ల టాలెంట్ ఏంటి అనేది బయటపడింది. అందులోనూ బిగ్ బాస్ హౌస్ లో సోహెల్, మెహబూబ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బయటికొచ్చాక కూడా తమ ఫ్రెండ్ షిప్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. జాన్ జిగ్రీలు అయ్యారు ఇద్దరూ. అందుకే ఇద్దరు ఎక్కడ కలిసినా కథ వేరే ఉంటది. ఇద్దరూ రచ్చ రంబోలా చేస్తున్నారు.
ఇటీవల బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అందరికీ మెగా బ్రదర్ నాగబాబు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో మళ్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కలిశారు. ఇక.. ఆ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం సోహెల్, మెహబూబ్ మాత్రమే.
ఇద్దరూ ఆ పార్టీలో చేసిన ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదు. వాళ్లిద్దరు కలిస్తే కథ వేరే ఉంటది అనే విషయం తెలుసు కదా. మొత్తం మీద నాగబాబు పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంతా సూపర్ డూపర్ ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన యూట్యూబ్ అకౌంట్ లో షేర్ చేశాడు.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా సోహెల్, మెహబూబ్ రచ్చను చూసేయండి ఈ వీడియోలో.