NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

హిందూ అస్త్రం..! బీజేపీ పెద్ద ప్లాన్ సీక్రెట్ గా వర్కవుట్ చేస్తున్న వైసీపీ..!?

Telugu Desam Party ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది. సహజం..! అధికార పక్షం YSR Congress party ఆరోపణలతో పాటూ ఆధారాలు చూపాలి..! కానీ ప్రతిపక్షం లాగానే అధికార పక్షం కూడా అధరాలు లేని ఆరోపణలు చేసేస్తే అది ప్రతిపక్షానికే లాభిస్తుంది. ఇప్పుడు హిందూ దేవాలయాల, విగ్రహాల ధ్వంసం ఘటనల్లో జరుగుతున్నది ఇదే..! Chandrababu Naidu టీడీపీనే TDP ఇది మొత్తం చేయిస్తుంది. YS Jagan Mohan Reddy ప్రభుత్వంపైకి  బురద చల్లడానికి టీడీపీ TDP వాళ్లే విగ్రహాలపై దాడులు చేయిస్తున్నారు అంటూ వైసీపీ YSRCP చెప్తుంది. సీఎం జగన్ Jagan కూడా అదే అంటున్నారు. అందుకు “సంక్షేమ పథకాల సమయంలోనే దాడులు” అంటూ కొన్ని లాజిక్కులు కూడా లాగారు. కాకపోతే ఇక్కడ ఆధారాలు మాత్రం చూపలేదు. అదే సమస్య. ఈ విషయాన్నీ కొంచెం పక్కన పెట్టేసి.. బీజేపీ BJP వేస్తున్న అడుగులు మాత్రం ఇప్పుడు కీలకంగా మారిపోయాయి. గడిచిన నాలుగైదు రోజులుగా బీజేపీ BJP అనూహ్యంగా వార్తల్లో నిలుస్తుంది, అంటే ఎంతో కొంత ఎదుగుతున్నట్టే లెక్క..!!

అతి చేస్తున్న బీజేపీ – పోలీసులు..!

హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న ఘటనలను రాజకీయంగా వాడుకోవాలని ఏ పార్టీలు అయినా చూస్తాయి. టీడీపీ, బీజేపీ కూడా అదే దారిలో ఉన్నాయి. టీడీపీ మొదటి రోజున, చంద్రబాబు రామతీర్ధం వెళ్లిన రోజున నిరనసలు చేసింది. ఆ తర్వాత వదిలేసింది. అక్కడ పోలీసులు చంద్రబాబుని అడ్డుకోవడం, కొందరు లారీలు అడ్డుపెట్టడం.., ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లడం అన్నీ ఆరోజు చర్చకు దారితీసాయి. అక్కడితో ఆ విషయం ముగియగా… ఆ తర్వాత నుండి బీజేపీ చేస్తున్న అతి మామూలుగా లేదు. ఈ నెల 5 న సోము వీర్రాజు నేతృత్వంలో బీజేపీ – జనసేన వాళ్ళు కలిసి రామతీర్ధం వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ అతి మొదలు పెట్టింది. “మమ్మల్ని పోలీసులు ఆపేస్తున్నారు బాబోయ్.. హిందూ దేవాలయాలను రక్షించడానికి వస్తున్న తమను పోలీసులు అడ్డుకుంటున్నారు బాబోయ్.., కాపాడండి, రక్షించండి, దేవుళ్ళని రక్షించండి అంటూ” నానా యాగీ చేసారు. సోషల్ మీడియా వేదికగా, వారి చానెళ్లు వేదికగా నానా రభస చేశారు. సానుభూతి, హిందూ సెంటిమెంట్ డ్రామాలు బాగానే పండించారు. దీంతో హిందూ సానుభూతిపరుల్లో బీజేపీ గురించి చర్చ మొదలయింది. సో… అతి చేయడం ద్వారా బీజేపీ కొంత ముందడుగు వేసినట్టే.

అరెస్టులు.., అరుపులు.., కేకలు.., ధర్నాలు..!!

మూడు రోజుల నుండి బీజేపీ ఇదే పంథాలో ఉంది. ఎవరో ఒకరు హిందూ దేవాలయాల దగ్గరకు వెళ్లడం.. వారిని పోలీసులు అడ్డుకోవడం.. దాన్ని సాకుగా చూపించి బీజేపీ నిరసనలకు పిలుపునివ్వడం.. వెరైటీ రాజకీయంగా మారిపోయింది. సో.. తమకు సరైన అస్త్రం దొరికితే తమకంటే ఎవరూ బాగా వాడలేరు అనే బీజేపీకి రామతీర్ధం అనే సరైన అస్త్రం దొరకడంతో ఇక చొచ్చుకువెళ్తుంది. ఇక్కడే వైసీపీ (ప్రభుత్వం) చేస్తున్న తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఓ సారి చెప్పుకోవాల్సిందే.!

* విగ్రహాలు, ఆలయాలు దగ్గరకు బీజేపీ నేతలు వెళ్తుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నట్టు..? వాళ్ళేమైనా సంఘ విద్రోహ శక్తులా..? విగ్రహాలను నాశనం చేసేస్తారా..? ముందే మాట్లాడి.. పోలీసులు నిఘా పెట్టి అనుమతులు ఇచ్చేస్తే బీజేపీ రాజకీయం అక్కడైతే ముగిసేది. అరెస్టులు జరిగితే గొడవ జరుగుతుంది.. గొడవ జరిగితే బీజేపీకి ఉనికి పెరుగుతుంది.. ఉనికి పెరిగితే తమ పార్టీ గురించి చర్చ మొదలవుతుంది.. అదే జరిగితే ఎంతో కొంత మైలేజి వస్తుంది. అనే ఒక స్ట్రాటజీ ప్రకారం ఇది మొత్తం జరుగుతుంది. అందుకే ఈ అతిలు, అరెస్టులు, గొడవలు. ప్రభుత్వం (పోలీసులు) ప్రవర్తన కారణంగా బీజేపీ ఎదుగుతుంది, మైలేజి తెచ్చుకుంటుంది అనడంలో సందేహాలు అవసరమే లేదు..!

ఇదే అదనుగా మరిన్ని పోరాటాలు..!

ఇన్నాళ్లు బీజేపీకి రాష్ట్రంలో పోరాటాలు చేయడానికి సరైన కారణాలు, సాకులు దొరకలేదు. అమరావతి, పోలవరం విషయంలో పోరాటాలు చేయలేరు. ఆ పాపంలో బీజేపీకి కూడా వాటా ఉంది కాబట్టి.., అలా పోరాటాలు చేస్తే వాళ్ళకే తిరిగి తగుల్తుంది. అందుకే బీజేపీకి బాగా తెలిసిన, బాగా కలిసి వచ్చిన.., బాగా అనుకూలమైన హిందూ అస్త్రం సంధించడం ద్వారా పోరాటాలకు దిగుతుంది. నెమ్మదిగా ఏపీలోనూ మత రాజకీయాలను దించేసింది. సో.., ఇదే ఊపులో, ఇదే అదనుగా మరిన్ని పోరాటాలకు పిలుపునిచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు.

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N