Categories: న్యూస్

పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ ఇక లేరు

Share

పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) కన్నుమూశారు. కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో కడ్తాల్ లోని కైలాశపురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. రేపు (సోమవారం) సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ఏపి, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు హజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

 

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా భోదన్ లో జన్మించిన సుభాష్ పత్రిజీ గతంలో కర్నూలు జిల్లాలో కోరమండల్ ఎరువుల కర్మాగారంలో ఉద్యోగిగా పని చేశారు. 2012 లో కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో కైలాసపరి మహేశ్వ ర మహా పిరమిడ్ నిర్మించారు. అదే సంవత్సరం డిసెంబర్ 18 నుండి జనవరి 31 వరకూ ప్రపంచ ధ్యాన మహాసభలను నిర్వహించారు. ఏపి, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు ఉన్నారు.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago