NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Sweet Potato: ఒక్క చిలగడదుంప తో ఎన్నో చిలగడదుంప చెట్లను ఇంట్లనే పెంచడం ఎలా..?

Sweet Potato gardening by Swathi Dwivedi

Sweet Potato: బెంగళూరుకు చెందిన స్వాతి ద్వివేది గార్డెనింగ్ లో మంచి ఎక్స్పర్ట్. అయితే ఎలాంటి విత్తనాలు లేకుండా మార్కెట్ నుండి కొనుక్కొచ్చిన చిలగడదుంప తో మన ఇంట్లోనే వాటిని పండించడం ఎలా అనేది ఎలాగో చేసి చూపించారు.

 

Sweet Potato gardening by Swathi Dwivedi 

బెంగళూరుకు చెందిన స్వాతి ఫుల్ టైం ప్రొఫెషనల్ హెచ్.ఆర్. అయితే గార్డెనింగ్ చేయడం ఆమె హాబీ. తన ఇంటి వెనుక ఆమె దాదాపు 200 చెట్లను పెంచుతున్నారు. వాటిలో బొప్పాయి, జామకాయ, చెరుకు లాంటి పండ్లు, క్యారెట్, అల్లం వంటి కూరగాయలు, కొత్తిమీర వంటివి ఎన్నో ఉన్నాయి. 

తన పంతం మీద మొదలెట్టి…

2020 ఆగస్టులో ఆమె తన ఇంట్లోనే చిలగడదుంపలు పెంచాలని తనకు తానే ఛాలెంజ్ విసురుకుంది. కొన్ని నెలల క్రితం ఆమె చేసిన ప్రయోగం చివరికి సక్సెస్ అయింది. మూడు కేజీల చిలగడదుంపలు ఆమె ఈ సమయంలో పండించారు. ఈ చిలగడదుంపలను మన తోటలో, మిద్దె పైన, బాల్కనీ లో అయినా పెంచడం చాలా సులువైన పని. సూర్యరశ్మి తగినంత వచ్చే ఏ ప్రదేశంలో అయినా వీటిని పెంచవచ్చు అని స్వాతి చెప్పారు

Swathi Dwivedi

తీపి బంగాళాదుంపలు లేదా చిలగడదుంపలు ఫైబర్ కి గొప్ప మూలం. అలాగే ఐరన్, కాల్షియం, విటమిన్ బి, సి సహా అనేక రకాల విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. విటమిన్ ఎ ని నిరోధించే బీటా కెరోటిన్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ ఉండటం ఒక ముఖ్యమైన పోషక ప్రయోజనం. ఇది కాకుండా, తియ్యటి బంగాళాదుంపలు గ్లైసెమిక్ సూచికలో తక్కువగా ఉంటాయి. ఇక మధుమేహం ఉన్నవారు సైతం మితంగా తినవచ్చు.

Sweet Potato: చిలగడ దుంపలు పండించేందుకు కావలసినవి

స్టోర్స్లో కొనుక్కొచ్చిన చిలగడదుంపలు

గాజు పాత్రలు

మట్టితో నిండిన కుండ

కంటైనర్

Sweet Potato gardening by Swathi Dwivedi 2

Step 1 కొనుక్కొచ్చిన చిలగడ దుంపల్ని సగానికి కట్ చేయాలి

Step 2 పాత్రలో సగం వరకు నీటిని ఉంచి చిలకడ దుంపలు రివర్స్ లో పెట్టాలి. పూర్తిగా వాటిని నీటిలో ముంచకూడదు.

Step 3 రోజు మార్చి రోజు గిన్నెలో నీళ్ళు మారుస్తూ ఉండాలి. పది రోజుల తరువాత చిలగడదుంపల పై చిన్న ఆకులు, వేర్లు రావడం గమనించవచ్చు

Step 4 అలాగే గాజు పాత్రల్లోనే చిలకడదుంపలని 30 రోజుల వరకు పెంచాలి

Step 5 చిలగడదుంప పెరిగిన తర్వాత వాటిని బయటకు తీసి దాని పై ఏర్పడే కొమ్మలను మొదలుతో సహా బయటికి తీయాలి.

Step 6 మరొక గాజు గ్లాసు తీసుకుని అందులో నీటిని నింపి కొద్దిరోజులు ఆ చిన్న కొమ్మలను నీటిలో ఉంచితే వేర్లు రావటం మొదలవుతాయి.

Step 7 ఇప్పుడు కంటైనర్ ను తీసుకొని అందులో ఆర్గానిక్ పోషణలతో నిండిన మట్టిని పోయాలి.

Step 8 ఇప్పుడు ఆ మట్టిలో చిన్న చిన్న రంధ్రాలు చేసి ఈ చిన్న కొమ్మలను ఆ కుండీ లో ఉంచాలి.

Step 9 తగినంత సూర్యరశ్మి వచ్చే ప్రాంతంలో దాని నుంచి ఎప్పుడూ తరుచుగా నీరు పోస్తూ ఉండాలి. 

Step 10 అంతే… ఆరు నుండి ఏడు మాసాలలో మొక్క పసుపు రంగులోకి మారుతుంది. ఆ తర్వాత పువ్వులు వచ్చి… పచ్చి చిలగడదుంపలు వాడుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

author avatar
arun kanna

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N