తనికెళ్ల భరణి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగుతున్న వ్యక్తి. ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు. ఎన్నో పాత్రలు పోషించి శెభాష్ అనిపించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ అంటే తనికెళ్ల భరణినే. ఆయన గొప్ప నటుడే కాదు.. రచయిత కూడా. ఎన్నో సినిమాలకు ఆయన రచన అందించారు. తాజాగా తనికెళ్ల.. ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణిలో ఉన్న ఎన్నో వేరియేషన్స్ బయటపడ్డాయి.

నిజానికి తనికెళ్లకు అంతగా చదువు అబ్బలేదట. దీంతో కొన్నిరోజులు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేశారట. అసలు.. తనికెళ్ల భరణి పూర్తి పేరేంటో తెలుసా? తనికెళ్ల దశభరణి శేషప్రసాద్. వామ్మో ఎంత పొడవు ఉందో. అసలు.. రచయిత అవ్వాలని కానీ.. అవుతానని కానీ.. తనికెళ్ల ఏనాడూ అనుకోలేదట. తన స్కూల్ ఫ్రెండ్ ప్రోత్సాహంతో రచనా రంగంలోకి తనికెళ్ల అడుగు పెట్టారట.
దొంగతనాలతో పాటు దాదాగానూ కొన్ని రోజులు తనికెళ్ల ఉన్నారట. ఇండస్ట్రీకి వచ్చాక ఇక నటుడిగా, రచయితగా బిజీ అయిపోయారు తనికెళ్ల. ఇలా.. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను ఆలీతో తనికెళ్ల పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. తనికెళ్ల భరణికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.