NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

టీమిండియా విజయం పై ప్రముఖుల ప్రశంసల వెల్లువ ..!

తొలిసారి కంగారు లకు ఓటమి రుచి చూపించిన టీమిండియా..! వరుసగా ఒకటి కాదు.. రెండు కాదు.. మూడోసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది..! ఇన్ని సంవత్సరాల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో టీమిండియా టెస్ట్ విజయం సాధించడం మరో విశేషం..! సీనియర్ ప్లేయర్లు లేకున్నా జూనియర్లు ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించారు..!

 

Team India won boarder gavascar trophy win A flood of celebrity tweets

ఉత్కంఠభరితంగా సాగిన 4 వ టెస్ట్ లో అద్భుత విజయంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-1 తేడా తో కైవసం చేసుకుంది. వీరోచిత పోరాటం తో మూడు వికెట్ల తేడాతో విజయకేతనం ఎగుర వేసింది.  డ్రా అవ్వటమే గొప్ప అనుకున్న భారత్ ను గెలిపించి యువ ప్లేయర్లు హీరోలు అయ్యారు..ఆస్ట్రేలియాతో టెస్టుల్లో టీం ఇండియా అద్భుత పోరాటం అందరినీ ఆకట్టుకునేలా చేసింది.  బ్రుమా , కోహ్లీ, షమీ ,ఇశాంత్, ఉమేష్, అశ్విన్ , జడేజా ఏడుగురు రెగ్యులర్ ప్లేయర్లు మ్యాచ్ కి దూరమైన యువ ప్లేయర్లు వెనుక అడుగు వేయలేదు..  ఆస్ట్రేలియాకు సవాల్ విసిరారు..  ఇంకోవైపు జాతివివక్ష వ్యాఖ్యలు,  మన ప్లేయర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేక పోయాయి.. 4వ టెస్టులో ఏకంగా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అందరి నోట శభాష్ అనిపించారు..

Team India won boarder gavascar trophy win A flood of celebrity tweets

గబ్బా టెస్ట్ విజయంతో టీమిండియా ఐసిసి ICC  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో అగ్రస్థానాన్ని కి దూసుకెళ్లింది..  71.7 % PCT తో , 430 పాయింట్లతో NO.1   స్థానాన్ని భారత్ సొంతం చేసుకుంది. చారిత్రాత్మక విజయంతో భారత్ ఈ ఘనత సాధించడం పై అభిమానులు, ప్రముఖలు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు..!

 

సచిన్ ట్వీట్ :

ఆస్ట్రేలియా పై భారత్ చారిత్రక విజయం సాధించడంపై సచిన్ టెండూల్కర్ స్పందించారు. ప్రతి సేషన్ లో ఒక హీరోను చూడగలిగాం.. దెబ్బతిన్న ప్రతి సారి బలంగా నిలుచున్నాం , భయం అనే హద్దుల్ని చెరిపేసి పోరాడారు . కానీ నిర్లక్ష్యంగా ఆడలేదు.. ప్రతికూలతలు,  గాయాలు ఎన్ని ఉన్న వాటిని అధిగమించాం. అత్యున్నతమైన సిరీస్ విజయాల్లో ఇది ఒకటి.. కంగ్రాట్స్ టీమిండియా అని మాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

Team India won boarder gavascar trophy win A flood of celebrity tweets

మోదీ ప్రశంసలు :

భారత జట్టు పై ప్రధాని మోదీ ప్రశంసలు తెలిపారు. “ఆటగాళ్లు తమ అభిరుచి , అద్భుత శక్తిని ప్రదర్శించారు .భారత జట్టు విజయాన్ని మేము ఎంజాయ్ చేసాము, అభినందనలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని” ఆయన ట్వీట్ చేశారు.

కేసీఆర్ ట్వీట్ :
గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ యువ క్రికెటర్స్ అద్భుతం చేశారని కొనియాడారు. ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుందన్నారు. టీమిండియా ప్లేయర్స్ భారత్ ను గర్వించేలా చేసారని, 2021 అద్భుతం గా ప్రారంభించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చేశారు.

విరాట్ కోహ్లీ ట్వీట్ :

భారత అద్భుత విజయం పై విరాట్ కోహ్లీ ఈ విధంగా ట్వీట్ చేశారు. “ఇది మామూలు విషయం కాదు. ఆడిలైట్ మ్యాచ్ తరువాత అవమానించిన ప్రతి ఒక్కరూ పైకి నిలబడేలా ఆడారు. ఇతరులు మెచ్చుకునేలా ఆడటంతో పాటు మంచి సంకల్పాన్ని చాటారు. జట్టు సభ్యులతో పాటు మేనేజ్మెంట్ కు అభినందనలు. విజయాన్ని ఆనందించండి. చీర్స్ “అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు.

Team India won boarder gavascar trophy win A flood of celebrity tweets

హీరో కార్తికేయ ట్వీట్ :

బ్రిస్బేన్ టెస్టులో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు .భారత్ గెలుపు పై స్పందించిన టాలీవుడ్ హీరో కార్తికేయ. “ఇటీవల కాలంలో చాలా సంతోషించే, గర్వించదగిన క్షణం ఇది.  ఈ సిరీస్ రాజమౌళి సినిమా కన్న తక్కువేం కాదు టీమిండియా” అని ట్వీట్ చేశారు.

*గొప్ప టెస్ట్ సిరీస్లో ఇది నిలుస్తుందని అద్భుతంగా ఆడిన టీమిండియాకు అభినందనలు తెలిపిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.

 

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N