ఈ మధ్య కాలంలో న్యూస్ చానెల్స్ కంటే యూట్యూబ్ చానల్స్ జనాల పై బాగా ప్రభావం చూపిస్తున్నాయి. బిగ్బాస్ ఇంటినుండి బయటికి వెళ్లిన వారికి కూడా అక్కడ విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఇంట్లో తన డేరింగ్ స్వభావంతో ఫైటర్ అని పేరు తెచ్చుకున్న అరియానా గ్లోరీ బాగా ఫేమస్ అయిపోయింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటే అందులో తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు లీక్ చేసింది. ఆ సంగతులు లోకి వెళ్తే…
బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత అరియానా ఫుల్ బిజీ అయిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఇక ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ లో చిట్ చాట్ చేసింది. దీంట్లో తన ఫస్ట్ కిస్ గురించి చెప్పేసింది. నేను ఒకరికి ముద్దు పెట్టింది నిజమే కానీ ఎవరో చెప్పను…. అది నా వ్యక్తిగతం అని షాక్ ఇచ్చింది.
నీ జీవితంలో ఎవరైనా అమ్మాయిని కొట్టావా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు…. అనూహ్యమైన సమాధానం ఇచ్చింది అరియానా. నేను కాలేజ్ లో ఉన్న సమయంలో ఒక అమ్మాయి నా గురించి చెడుగా మాట్లాడింది. ఆమె దారుణమైన మాట అంది. దీంతో వెంటనే వెళ్లి గొడవ పడ్డాను. అంతే కాదు అందరి ముందే ఆమెను బాగా కొట్టాను అని వివరించింది బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.