NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Andhra Pradesh: అప్పుడో ఓ డాక్టర్ ..ఇప్పుడో డిప్యూటీ తహసీల్దార్!ప్రభుత్వానికి చుర్రుమనిపించేలా సెల్ఫీ వీడియోలు!!

Andhra Pradesh: కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు కట్టినా కూడ సరైన వైద్య సహాయం అందని దుస్థితి నెలకొంది.ఈ పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎక్కువగా ప్రభుత్వాస్పత్రులలో ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లు ఇప్పటిదాకా చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వాసుపత్రులలోనే ఇలాంటి పరిస్థితి ఉందనుకుంటే పొరపాటే. కార్పొరేట్ ఆస్పత్రుల్లో డబ్బులు పెట్టి చికిత్స పొందుదామనుకుంటే కూడా ఆ హాస్పిటల్స్లో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులు లేవని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Then a doctor..now a deputy tahsildar! Selfie video to make the government laugh !!
Then a doctornow a deputy tahsildar Selfie video to make the government laugh

ఇది ఓ డిప్యూటీ తహసీల్దార్ వ్యథ!

తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి విడుదల చేసిన సెల్ఫీ వీడియో కోవిడ్‌ దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం డిప్యూటీ తాసిల్దార్ మురళీకృష్ణ ఇటీవల కోవిడ్‌ బారినపడ్డారు. ఆయన తల్లికి కూడా వైరస్‌ సోకింది. దీంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో డబ్బులు కట్టి చేరినప్పటికీ తమకు కనీస వైద్యం కూడా అందించడం లేదని చెప్పారు. తన తల్లికి ఇంకా కనీసం సెలైన్‌ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు అడిగినా పట్టించుకునే నాధుడే లేరని ఆయన ఆరోపించారు.ఆస్పత్రిలో పదే పదే అడిగితేనే భోజనం అందిస్తున్నారని, అది కూడా పాచిపోయిన భోజనం రోగులకు పెడతున్నారని మురళీ కృష్ణ ఆరోపించారు. అర్ధరాత్రి 12 గంటలకు భోజనం ఇస్తున్నారంటూ ఆయన ఓ సెల్ఫీ వీడియో తీసి విడుదల చేశారు. ప్రస్తుతం డిప్యూటీ తహసిల్దార్‌ మురళీకృష్ణ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.

అప్పుడు డాక్టర్ సుధాకర్ ..ఇప్పుడీ డిప్యూటీ తహశీల్దార్!

గత ఏడాది కరోనా సమయంలో నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సుధాకర్ సర్కార్ దవాఖానాల్లో నెలకొన్న సౌకర్యాల లేమి గురించి సెల్ఫీ వీడియో పెట్టగా ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయడం తెలిసిందే.తదుపరి పరిణామాల్లో డాక్టర్ సుధాకర్ ను విశాఖపట్నం లో పోలీసులు కొట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడ౦, అది పెద్ద వివాదం కావడం కూడా విదితమే. డాక్టర్ సుధాకర్ ఉదంతంపై హైకోర్టు సీబీఐ విచారణకు సైతం ఆదేశించింది. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ కూడా ఇదే తరహా సెల్ఫీ వీడియో పెట్టడంతో అధికార వర్గాల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N