Today Gold Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఒకవైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. మరోవైపు వెండి ధరలు తగ్గాయి.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..
Read More: Railway Notification: నిరుద్యోగులకు శుభవార్త.. సదరన్ రైల్వేలో 3378 ఖాళీలు..!!
గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.50,300 వద్ద ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ, మైసూర్, మంగుళూరు, భువనేశ్వర్ లో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న ఏకంగా 4,800 పెరిగిన వెండి ధర ఈరోజు అమాంతం చతికిలబడింది.. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఈరోజు రూ.200 వెండి ధర తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర 76,600 కి క్షీణించింది.. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభ తరుణంగా చెప్పవచ్చు.