Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో..హౌస్ లో దడ దడ లాడించిన కంటెస్టెంట్ ఉమాదేవి. ఏటువంటి విషయం అయినా మొహం మీద చెప్పేసే ఉమాదేవి రెండో వారం లోనే ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం తెలిసిందే. హౌస్ లో ఉన్నంత కాలం ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెప్పేస్తూ.. బిగ్బాస్ ఇంటి సభ్యులను ఓ రేంజ్ లో ఆడుకుంది. నా పుట్టలో చేయి పెడితే నేను ఊరుకుంటానా.. అంటూ ఇంకా పచ్చి బూతులు కూడా ఒకానొక టైంలో ఎలిమినేషన్ సమయంలో.. పెద్ద వయసులో ఉండి ఉమాదేవి మాట్లాడటంతో.. చాలావరకు కుటుంబ ప్రేక్షకుల ఓట్లను కోల్పోయి రెండో వారంలో ఎలిమినేట్ అవ్వడం జరిగింది.
ఆమె వ్యవహరించిన తీరుకు నెగటివ్ షేడ్ ప్రేక్షకులలో పడగా తాజాగా ఆమె చేసిన ఒక చిన్న పని ఆమె పై సోషల్ మీడియాలో ఎవరైతే.. వేస్ట్ అన్నారో వారి చేత శభాష్ అనిపించుకున్న రీతిలో ఒక మంచి పని చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు ఉండటంతో తనకు వచ్చిన పారితోషకాన్ని… దానిలో కొంత భాగాన్ని బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి చికిత్సకోసం అందించింది.
తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో రావటంతో నెటిజన్లు ఉమా చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ… ఆమెకు మరోసారి హౌస్ లో వెళ్లడానికి బిగ్ బాస్ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. చాలా పెద్ద మంచి మనసు అని అనిపించుకున్న రండి అంటూ మరి కొంతమంది ఉమాదేవి చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఉమాదేవి తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం మంచి పనికి ఉపయోగించడంతో చాలామంది. పొగుడుతూ ఉన్నారు. హౌస్ లో మాస్కులు లేకుండా ఆడిన కంటెస్టెంట్ లో ఒకరు ఉమాదేవి అంటూ .. మరికొంతమంది ఆమె ఎలిమినేట్ అవ్వడంపై రియాక్ట్ అవుతున్నరు.