న్యూస్ సినిమా

Vakeel Saab Teaser : ‘క్లాస్ గా ఉండే మాస్ వకీల్ సాబ్’ పవర్ స్టార్

Vakeel Saab Teaser : ‘క్లాస్ గా ఉండే మాస్ వకీల్ సాబ్’ పవర్ స్టార్
Share

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ముందుకు వచ్చేసాడు. ఎప్పటినుండో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యింది. టీజర్ విడుదలైన మూడు నిమిషాల్లోనే లక్ష వ్యూస్ సాధించి దూసుకెళ్తున్న ఈ టీజర్ లోని ముఖ్య విషయాలు మీకోసం…

Vakeel Saab Teaser : ‘క్లాస్ గా ఉండే మాస్ వకీల్ సాబ్’ పవర్ స్టార్
Vakeel Saab Teaser : ‘క్లాస్ గా ఉండే మాస్ వకీల్ సాబ్’ పవర్ స్టార్

 

టీజర్ ఓపెనింగ్ షాట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపిస్తాడు. నల్ల కోటు వేసుకున్న తర్వాత రౌడీలను చితకొట్టే షాట్ ఒకటి ఉంటుంది. ఆ తరువాత కోర్టులో పవన్ స్టైల్ ను మరొక రెండు షాట్స్ లో చూపిస్తారు. వెంటనే ఒక్కసారిగా కోర్టులో లేచి “అబ్జెక్షన్ యువర్ హానర్” అంటూ బల్ల మీద గట్టిగా కొట్టి పెన్నుని విసిరేస్తాడు. మొదటి 20 సెకండ్లలోనే పవన్ కళ్యాణ్ ఎలాంటి వకీలు అనేది డైరెక్టర్ టీజర్ తోనే ఒక ఐడియా ఇచ్చేశాడు.

ఆ తర్వాత మెట్రో రైలు లో మరొక ఫైట్ ఉంటుంది. పవన్ కత్తితో పొడవబోతున్న వాడి చేయి పట్టుకొని “కోర్టులో వాదించడమూ తెలుసు… కోటు తీసి కొట్టడమూ తెలుసు” అని ఒక మాస్ ఫైట్ ఉంటుంది. ఇక ఆ తర్వాత నల్లకోటు నల్ల ప్యాంటు తో పవన్ తన మార్క్ వాకింగ్ స్టైల్ తో తన ఫ్యాన్స్ ను అలరిస్తాడు. 

ఇక చివరి షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఒక ట్రక్ వెనకాల కూర్చుని పుస్తకాలు మధ్య కుర్చీ వేసుకొని చదువుకుంటూ ఉంటాడు. మొత్తానికి పవన్ అల్ట్రా మాస్ స్టైలిష్ అవతరా ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ తమకు నచ్చిన క్లాసీ మాస్ యాంగిల్ లో చూసి అభిమానులు తరించిపోతున్నారు అనే చెప్పాలి.


Share

Related posts

కొల్లు రవీంద్ర బయటకి వచ్చే ఛాన్స్ స్పష్టంగా ఉన్నా.. కావాలని అడ్డం పడుతోంది ఎవరు?

CMR

Nimmagadda Ramesh Kumar : త్వరలో మరొక నోటిఫికేషన్ – నిమ్మగడ్డ ప్లాన్ ఇదేనా ?

somaraju sharma

ఆ ఇద్దరు టాప్ హీరోలకీ మొహం మీదే నో చెప్పేసిన పూజా హెగ్డే .. రగిలిపోతున్న ఫాన్స్ ! 

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar