Chandrababu Naidu: ప్రముఖ జోతిష్య పండితుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానీకానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించి సంచలన విషయాలను ముందుగానే వెల్లడిస్తూ పాపులర్ అయ్యారు. గతంలో నాగ చైతన్య , సమంత జంట విడిపోతారంటూ ముందుగానే వెల్లడించి సంచలనం సృష్టించారు. అంతే కాకుండా పలువురు సెలబ్రిటీల జాతకాలను వేణుస్వామి చెప్పినట్లుగా ఆ తర్వాత జరగడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.

తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అయి జైలు పాలు అవ్వడంతో మూడేళ్ల క్రితం ఆయన (వేణుస్వామి) చెప్పిన మాటలు నిజమైయ్యాయి అంటున్నారు. మూడేళ్ల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి .. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసిఆర్ జాతకం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వేణు స్వామి జోస్యం అక్షరాలా నిజమైందందని ఆయన పాత ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నారు. అయితే ఆనాడు వేణు స్వామి.. చంద్రబాబు జైలుకు వెళతారని చెప్పనప్పటికీ చంద్రబాబు జాతక రీత్యా కచ్చితంగా సమస్యల బారిన పడతారు అని పేర్కొన్నారు. వందకు వంద శాతం ఆయన సమస్యల బారిన పడతారు అని వేణు స్వామి స్పష్టం చేశారు.

కేసిఆర్, చంద్రబాబు జాతకాలు ఒకేలా ఉన్నాయని పేర్కొన్నారు వేణుస్వామి. ఇద్దరిదీ కర్కాటక రాశి అని చెప్పిన వేణు స్వామి.. 2022 ఆగస్టు తర్వాత ఇద్దరి జాతకాల్లోకి అష్టమ శని ప్రవేశిస్తుందనీ, దీంతో అష్టకష్టాలు పడాతరని చెప్పారు. అనారోగ్యం, న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. దాదాపు 30 ఏళ్ల క్రితం వారు ఎదుర్కొన్న ఇబ్బందులనే మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. చంద్రబాబుకు 2024 వరకూ బ్యాడ్ టైమ్ నడుస్తొందని పేర్కొన్నారు వేణుస్వామి.

అదే క్రమంలో 2024 లో చంద్రబాబు గెలవడం కష్టమని కూడా వేణు స్వామి చెప్పారు. ఏదైనా పరిహారాలు చేసుకున్నప్పటికీ ఉపయోగం లేదని సబ్జెక్ట్ చేయి దాటి పోయిందన్నారు. అనాడు వేణుస్వామి చెప్పినట్లుగా చంద్రబాబు నేడు కష్టాల పాలైయ్యారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయి జైలు లో ఉన్నారు. దీంతో వేణు స్వామి చంద్రబాబు విషయంలో చెప్పిన జాతకం నిజమైందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ వ్యతిరేక గ్రూపులు వేణుస్వామి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.