Krishnamma Kalipindi Iddarini Latest: అబ్బా చా అవునా ఆల్ ద బెస్ట్ అని ఉజ్వల అంటుంది. చూద్దువుగానే ఉండు ముందు ముందు ఏం జరుగుతుందో అని గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఏంటి మమ్మీ దాని నమ్మకం మన దగ్గర ఎవిడెన్స్ ఉందని కూడా భయం లేకుండా అది అంత నమ్మకం గా చెబుతుంది మనని ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొడతానని అని ఉజ్వల అంటుంది. మనం ఎవిడెన్స్ ని నమ్ముకుంటే అది నమ్మకాన్ని నమ్ముతుంది అందుకే అంత గట్టిగా మాట్లాడి వెళ్లిపోయింది అని సౌదామిని అంటుంది. అది చూస్తాను అది ఏం చేస్తుందో అని ఉజ్వల అంటుంది. కట్ చేస్తే ఈశ్వర్ షర్టు వేసుకుంటూ ఉండగా తల మీది నుంచి షర్టు కిందికి రాకుండా ఇరుక్కుపోతుంది.

ఏవండీ తల ఇరుక్కుపోయింది నేను తీస్తాను ఉండండి అని గౌరీ అంటుంది. నా జీవితమే నీ చేతులు ఇరుక్కుపోయింది ఈ చొక్కా ఎంత అని ఈశ్వర్ అంటాడు. సురేఖలు వేయడం మానేసి ముందు మీరు షర్టు తీసుకోండి అని గౌరీ అంటుంది. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అని అంటారు అది నిజమేనేమో అని ఈశ్వర్ అంటాడు. రామచంద్ర ప్రభు నా మీద కౌంటర్లు మానేసి మీ పని మీరు చూసుకోండి అని గౌరీ అంటుంది. షర్టు కిందికి లాక్ ఉంటూ ఉండగా ఈశ్వర్ గౌరీ మీద పడిపోతాడు ఏంటి నువ్వు నా మీద పడ్డావు లే అని ఈశ్వర్ అంటాడు. మహాప్రభో నేను మీ మీద పడలేదు మీరే నా మీద పడ్డారు అని గౌరీ అంటుంది. అవునా సారీ అని అంటాడు ఈశ్వర్. గుండీలు సరిచేసుకోవడం తెలియదు కానీ నామీద సెటిల్ మాత్రం వేస్తారు గుండీలు సరి చేసుకున్నట్టు మనం ఇద్దరం మాట్లాడుకొని సరి చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అపార్థం తొలగిపోతుంది అని గౌరీ అంటుంది.

ఇక ఆపుతావా నీ ప్రవచనాలు వినలేక పోతున్నాను నాది అపార్థమే అయితే అది పోతుంది కానీ అది అపార్థం కాదు బాధ ఎలా పోతుంది అయినా మీ చెల్లెల్ని ఇక ముందైనా దొంగతనం చేయవద్దని మా తమ్ముడిని బాధ పెట్టొద్దని చెప్పాను మీ చెల్లికి నువ్వు చెప్పావా అని ఈశ్వర్ అంటాడు. మా చెల్లెలు దొంగతనం చేయలేదు అది ఎవరు చేశారో తొందరలో నిరూపిస్తాను అని గౌరీ వెళ్ళిపోతుంది. అయ్య బాబోయ్ గౌరీ ఇంత దగ్గరగా ఉంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని ఈశ్వర్ అనుకుంటాడు. కట్ చేస్తే అఖిల బెడ్ రూమ్ లో కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తుంది. ఏంటి అఖిల ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమైంది అని ఆదిత్య అంటాడు. చంప వాచింది అని అఖిల అంటుంది అవునా ఎందుకు అని ఆదిత్య అంటాడు మీరు కొట్టినందుకు నా రెండు జ్ఞాన దంతాలు దెబ్బతిన్నాయి ఏమి మాట్లాడడానికి రావట్లేదు అని అఖిల్ అంటుంది అయితే హాస్పిటల్ కి వెళ్దాం పద అని ఆదిత్య అంటాడు హాస్పిటల్ కి వద్దు ఏమి వద్దు మీ అమ్మ దగ్గరికి వెళ్లి చెబుదాం పద అని అఖిల అంటుంది.

అఖిల ఈ విషయం అమ్మకి తెలిస్తే బాధపడుతుంది అసలే పొద్దున నుండి నగల విషయంలో అమ్మ చాలా బాధపడుతుంది ఇంకా ఈ విషయం చెప్పి తనని బాధ పెట్టొద్దు అని ఆదిత్య అంటాడు. అయితే మీరు నన్ను కొట్టారు కదా ఒక పని చేయండి మీరు నన్ను కొట్టినందుకు ఈ చంప మీదే ముద్దు పెట్టండి చెల్లుకు చెల్లు అని అఖిల అంటుంది. ఏంటి ముద్ద నేను పెట్టను అని ఆదిత్యా అంటాడు. అయితే మీ అమ్మగారి దగ్గరికి వెళ్లి చెబుదాం పద అని అఖిల అంటుంది. అఖిల అది కాకుండా ఇంక వేరే ఏదైనా అడుగు ఇస్తాను అని ఆదిత్య అంటాడు. అవునా అయితే ఒక పది వేలు ఇవ్వండి అని అఖిల్ అంటుంది. ఏంటి పదివేల అని ఆదిత్యా అంటాడు. అవును ఇవ్వరా అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్దాం పదండి అని మళ్ళీ అఖిల బెదిరిస్తుంది. ఏ అఖిల వద్దు ఉండు ఇస్తాను అని పదివేలు తీసి ఇస్తాడు ఆదిత్య. కట్ చేస్తేఏంటి మమ్మీ వీళ్లిద్దరూ ఇంత క్లోజ్ గా ఉన్నారు అని ఉజ్వల అంటుంది.

నిన్నటిదాకా ఉప్పు నిప్పు లాగా ఉన్న వీళ్లు ఇంత ప్రేమగా ఎప్పటినుంచి ఉంటున్నారు అదే నాకు అర్థం కావట్లేదు బేబీ అని సౌదామని అంటుంది.అందరి ముందు నటిస్తున్నారని మనకు తెలిసిన అది ఇంత కాన్ఫిడెన్స్ గా ఉంది ఎలా తనని ఈశ్వర్ బావ నుండి వేరు చేయాలి మమ్మీ అని ఉజ్వల అంటుంది. ఇంతలో గదిలో నుండి బయటకు వస్తుంది గౌరీ ఏంటి పిన్ని గారు ఇక్కడ ఏం చేస్తున్నారు అని గౌరీ అంటుంది.నువ్వు మీ ఆయనతో ఎంత అన్యోన్యంగా ఉన్నావో చూస్తున్నాము అని సౌదామిని అంటుంది. అవునా చూస్తూ ఉండండి నగలు కొట్టేసిన సంగతి మా ఆయనకు చెబుదామని అనుకున్నాను కానీ మీరు ఆస్తులన్నీ పోగొట్టుకొని చాలా మంచి వాళ్ళలగా ఉంటున్నారు అని ఆయన నమ్ముతున్నారు మీలో ఎంత విషయం ఉందో కాలమే బయటపెడుతుంది అది ఏదో ఒక రోజు జరుగుతుంది చూడండి అని గౌరీ అంటుంద. అబ్బ చా అయితే మీ వీడియో మీ అత్తయ్యకి చూపిస్తే ఏం జరుగుతుందో అనే భయం కూడా లేకుండా నువ్వు మా ముందే తల ఎత్తి పొగరుగా మాట్లాడుతున్నావు అని సౌదామిని అంటుంది.

వద్దు పిన్ని గారు అని గౌరీ అంటుంది ఆ వీడియో మీ అత్తయ్యకు చూపిస్తే ఏం జరుగుతుందో అనే భయం నీకు ఉన్నంతవరకు మాకు భయమెందుకు గౌరీ అని సౌదామిని అంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య వచ్చి ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు అని సునంద అంటుంది.ఏమీ లేదు వదిన ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది కొంచెం తలుపులు వేసుకొని కింద మీద పడండమ్మా అని నా పెద్ద కూతురు లాంటి గౌరీ కి చెబుతున్నాను వదిన అని సౌదామిని అంటుంది. తను చెప్పేది నిజమే కదా అమ్మ ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది అని సునంద అంటుంది. వాళ్ల మాటలు విన్న ఈశ్వర్ అమ్మ ఏంటి అని బయటికి వస్తాడు. ఏమీ లేదండి మనం ఇద్దరం బెడ్ మీద పడింది మీ అత్తయ్య చూసిందట తలుపులు వేసుకోవచ్చు కదా అని అంటుంది అని గౌరీ అంటుంది. ఆ మాట విన్న ఈశ్వర్ ఏమి మాట్లాడకుండా అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరే నాన్న నువ్వు పదా నేను వస్తాను అని సునంద అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది