Krishna Mukunda Murari Today సెప్టెంబర్ 11 ఎపిసోడ్ 260: అలేఖ్య ఈరోజు నుంచి ఇకనుంచి నాకు అన్నీ మంచి రోజులే అని ముకుందా అంటుంది. నీకు ఒక విషయం చెప్పాలి ముకుందా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మీ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ నేను దాచను ఆ రోజు నువ్వు ఒకటి చూపించాలి అన్నావు కదా.. అది అంతా చేంజ్ చేసింది ఎవరో అని అలేఖ్య అనగానే.. ఇంకెవరు రేవతి అత్తయ్య అని ముకుందా అంటుంది. కాదు మా మధు అని అలేఖ్య చెబుతుంది.

మనందరం ఒకటే అని అనుకుంటాం కానీ వీళ్ళందరూ బ్లడ్ రిలేషన్ ముకుందా.. ఆదర్శ్, మురారి, మధు వీళ్లంతా బ్లడ్ రిలేషన్స్.. వీళ్లంతా ఒక్కటే మనల్ని వేరు చేసి చూస్తారు అని అలేఖ్య అంటుంది. ఆ మాటకు ముకుందా షాక్ అవుతుంది. వెంటనే ముకుందా మనసులో ఇకనుంచి ఎవరితో ఎంతవరకు ఉండాలి మనం హద్దులు దాటి ఎవరితోనూ ప్రవర్తించకూడదు అని ముకుందా మనసులో అనుకుంటుంది. సరే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని కదా అందుకే నేను నీకు ఈ నిజం చెప్పేశాను అని అలేఖ్య ముకుందతో అంటుంది. సరేరా టిఫిన్ చేయటానికి వెళ్దాం అనగానే నువ్వు కదా నేను వస్తున్నాను అని ముకుందా అంటుంది.

ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. భవాని ముకుంద ఏంటి ఇంకా రాలేదు అని అనగానే అలేఖ్య కల్పించుకుని ఈమధ్య ముకుంద కూడా ముభవంగా ఉంటుంది. అయినా ముకుంద ఒంటరిగా ఉంటుంది ఆ రోజు మీరు ముకుందని అరిసారు కదా మురారి తన భర్త అని అన్నందుకు అప్పటినుంచి తన కాస్త దూరంగా ఉంటుంది అని అలేఖ్య అంటుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా అని అలేఖ్య ను మధు అరస్తాడు.

అప్పుడే కృష్ణ సీన్ లోకి ఎంటర్ అయ్యి మధు గురించి మాట్లాడుతుంది. కానీ ఇక్కడ జరిగేది ఒకటి మీరు మాట్లాడుకున్నది ఇంకోటి అని భవాని అంటుంది. కృష్ణ ఏదో మాట్లాడుతూ ముకుందా ఏంటి ఇంకా రాలేదు అని అంటుంది చూసావా కృష్ణ అటు తిరిగి ఇటు తిరిగి మనం ఎక్కడైతే టాపిక్ ఆపామో అక్కడికే వచ్చి ఆగింది అని భవాని అంటుంది. తింగరి పిల్ల నేను నీకు క్యాంపుకు వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పాను. అది ఏంటో చెప్పు అయినా నేను చెప్పిన మాటనే మర్చిపోతున్నావా అని భవాని కాస్త గట్టిగా అడుగుతుంది. అయ్యో అత్తయ్య నేనా మీరు చెప్పింది మర్చిపోయానా అని ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నారు కదా అని కృష్ణ అంటుంది. అవును అని భవాని ఒక డాక్యుమెంట్ తీసి కృష్ణ చేతిలో పెడుతుంది.

మీ అమ్మ పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని నీ చిన్నప్పుడే అడిగింది కదా తన కోసమే నువ్వు డాక్టర్ అయ్యావు కదా అందుకే నీ కోసం నేను హాస్పిటల్ కట్టించాను అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవి అని భవాని అందరూ ముందు చెప్పగానే అందరూ సంతోషిస్తూ క్లాప్స్ కొడతారు ఇక కృష్ణ ఆనందభాష్పాలు పెట్టుకుంటూ మీరు దొరకడం నా అదృష్టం అత్తయ్య ఈ ఇంటికి కోడలుగా రావడం నా భాగ్యం అంటూ ఆనందంతో పొంగిపోతూ భవానిని హత్తుకుని ఏడుస్తుంది కృష్ణ.
Krishna Mukunda Murari: కృష్ణ ముందే ముకుంద తో అలా వచ్చిన మురారి.. భవని కి నిజం చెప్పనున్న ముకుంద..

అప్పుడే ముకుందతో నీకు కూడా మరో పది రోజుల్లో సర్ప్రైజ్ ఉంటుంది అని భవాని చెబుతుంది . అది నాకు సర్ప్రైజ్ కాదు అత్తయ్య అని ముకుందా మనసులో అనుకుంటుంది. అప్పుడే ముకుందని భవాని మొన్న నాకు ఏదో చూపిస్తాను అన్నావుగా అదేంటో చెప్పు అని నిలదీస్తుంది. అప్పుడు ముకుందా నా గదిలో వాస్తు బాగోలేదని పంతులుగారు చెప్పారు అది చెబుదామని మురారి వాళ్ల గదిలోకి తీసుకువెళ్లాను వాళ్లకు ఇది నాకు బాగా కలిసొస్తుందని పంతులుగారు చెప్పారు అని అనగానే అబద్ధాలు బాగానే చెబుతున్నావు అని భవాని అంటుంది అప్పుడు ఆ మాటకు ముకుందా మళ్లీ ఆ పంతులుగారు గీసిచ్చిన డ్రాయింగ్ పేపర్ నేను కృష్ణ వాళ్ళ గదిలోనే పెట్టాను అది చూపిద్దామనే మిమ్మల్ని అక్కడికి తీసుకు వెళ్ళాలని అనుకున్నాను అని ముకుందా అంటుంది సరే ఎలాగూ ఇన్ని రోజులు ఆగావు కదా ఇంకొక పది రోజులు ఓపిక పట్టు నువ్వు అనుకున్నది జరుగుతుంది అని భవాని అంటుంది.

కృష్ణ ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్తుండగా ముకుందా తన గదిలోకి వెళ్లి నేను నాకు ఒక విషయం చెప్పాలి పెద్ద సీక్రెట్ రా అని బయటకు తీసుకువెళ్ల పోతుంది. అయితే ఏసిబి సార్ కి మెసేజ్ చేసి వస్తాను అని కృష్ణ అంటుంది. తనకి కూడా మెసేజ్ చేయకూడదు రా అని కృష్ణ ను ముకుందా తనను బయటకు తీసుకువెళ్లబోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో ముకుందా మురారి దగ్గరకు వెళ్లి నేను కృష్ణకు మన ప్రేమ విషయం చెప్పేసాను అని చెబుతుంది నువ్వు నాకు కావాలి మురారి నువ్వు లేకుండా నేను ఉండలేను అని మురారిని గట్టిగా హత్తుకుంటుంది ముకుంద అది కృష్ణ చూస్తుందా లేదా అనేది తరువాయ భాగంలో చూడాలి.