Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. టాప్ మోస్ట్ క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ యాంకర్ రవి. మనోడు ఈ సీజన్ లో… ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా షోకి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. కానీ మనోడు ఆడుతున్న ఆట తీరు.. ఎక్కువగా బ్రెయిన్ గేమ్ ఆడుతూ.. స్ట్రాటజీ లతో దూసుకు పోతున్నాడు. ఈ క్రమంలో రవి వేసిన కొన్ని ఎత్తుగడలు అట్టర్‌ఫ్లాప్ అవ్వటం మాత్రమే కాక అతడికి కొన్ని టైటిల్స్ కూడా తెచ్చి పెట్టడం జరిగింది. ముఖ్యంగా రెండవ వారంలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత నటరాజ్ మాస్టర్ హౌస్ లో గుంటనక్క .. అంటూ పరోక్షంగా రవి ని ఉద్దేశించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు ఎక్కడ యాంకర్ రవి దొరకకపోవడంతో.. గుంటనక్క టైటిల్ రావడంతో పాటు కొన్ని సందర్భాలలో కెమెరాలలో.. రవి డబుల్ గేమ్ ఆడుతూ.. అడ్డంగా బుక్ కావడంతోపాటు.. అబద్ధాలు ఆడి అడ్డంగా అమ్మ తోడు అని ఓట్లు పెట్టడం.. రవి పరువు తీసేసినట్లాయింది. ఆ తరువాత ప్రతి వీకెండ్ లో..హోస్ట్ నాగార్జున… గుంటనక్క ప్రస్తావన తీసుకు వస్తూ రవి పై పంచ్ డైలాగులు వేస్తూ ఉన్నారు. అయితే గత రెండు వారాలు ఈ గుంట నక్క ప్రస్తావన రాలేదు.
రవికి సెకండ్ ప్లేస్
కానీ ఆదివారం విశ్వ ఎలిమినేషన్ అయిన తర్వాత.. రవినీ అందరు గుంటనక్క అని అంటారు. కానీ మనోడు స్ట్రాటజీ లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. రవి అద్భుతంగా గేమ్ ఆడుతున్నాడు అంటూ రవికి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని హౌస్‌లో పదిమందిలో రవికి సెకండ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ రవి విషయంలో గుంటనక్క ప్రస్తావన.. విశ్వ తీసుకురావటంతో సోషల్ మీడియాలో విశ్వ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.