NewsOrbit
న్యూస్

Water : మూలిగే నక్కపై జల పడగ! తెలుగు రాష్ట్రాలకు కొత్త సమస్య!

Water : నీరు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది.. ముఖ్యంగా సాగు నీరు water పారితే నే ఆ ప్రాంతమంతా ముందుకు వెళుతుంది. నీటికి మానవుడికి విడదీయలేని సంబంధం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాధారం అయిన కృష్ణ, గోదావరి నదుల నీటి  ఈ విషయంలో మరో కీలకమైన అడ్డంకి కర్ణాటక కల్పించడానికి రంగం సిద్ధం చేసింది. వారు చేసే పనివల్ల తెలుగురాష్ట్రాలకు నీటి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.

Water
Water

** తుంగభద్ర ప్రాజెక్టు లోకి వచ్చే ప్రవాహాన్ని తగ్గించే చర్యలకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచుతూ, దానిని ఆమోదించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదించింది. దీనివల్ల తుంగభద్ర తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు పైన ప్రభావం పడుతుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల కు తీరని నీటి నష్టం చేకూరుస్తుందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

** తుంగ నది నుంచి అప్పర్ భద్ర ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోతల డంతో పాటు, అప్పర్ భద్ర నుంచి 30 టీఎంసీల వినియోగం కి కర్ణాటక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు 367 చెరువులను నింపడానికి 16,125 కోట్ల అంచనాలతో కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. దీనిపై గత ఏడాది డిసెంబరు 24న జరిగిన సాంకేతిక సలహా కమిటీ సమావేశమై కర్ణాటక ప్రతిపాదన మీద చర్చించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం, ఖర్చు ప్రయోజనం విషయంలో కొన్ని అభ్యంతరాలు తెలియజేసిన జలసంఘం త్వరలోనే దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కర్ణాటక దీనికి జాతీయ హోదా ఇవ్వాలని సైతం కేంద్రాన్ని కోరుతోంది.

** గతంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిన, దాని సామర్థ్యం పెంచడం తుంగానది నీటిని మళ్లించడంతో తుంగభద్ర కు నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. నదిలో నీటి లభ్యత తక్కువగా ఉండే సంవత్సరాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుంగభద్రా నదికి తుంగ, భద్ర నదుల కలయిక ద్వారా ప్రవాహం వస్తుంది. ఇందులో 70 శాతం నీరు తుంగ నుంచే ఎక్కువగా వస్తుంది. తుంగభద్రా నది పై షిమోగా సమీపంలో నాలుగు టీఎంసీల సామర్థ్యంతో ఆనకట్ట మాత్రమే ప్రస్తుతం ఉంది.

బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఈ ఆనకట్ట స్థానంలో కొత్త దాన్ని నిర్మించారు. ఇక్కడ అతి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తే పశ్చిమ కనుల పై ప్రభావం పడే అవకాశం ఉండడంతో నిపుణుల సలహా మేరకు దానిని ఇప్పటివరకు చేయలేదు. భద్ర నది నుంచి కర్ణాటకకు 62.5 టీఎంసీల కేటాయింపు ఉంది. ఈ మొత్తం నీటిని కర్ణాటక వినియోగించుకుంటుంది. అయితే భద్ర డ్యామ్ నుంచి అప్పర్ వద్దకు ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు కర్ణాటక చేపట్టింది. వీటి పనులు చకచకా జరుగుతున్నాయి.

** గత ఏడాది రోజుకు 600 క్యూసెక్కుల చొప్పున సుమారు 20 టీఎంసీల ఎత్తి వేసినట్లు సమాచారం. భద్రానది నుంచి ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టు లోకి వచ్చే ప్రభావం చాలా కీలకం. ఈ ప్రవాహం తర్వాత శ్రీశైలం లోకి చేరుతుంది. దీంతో భద్రానది నుంచి అదనంగా నీటి వినియోగానికి ఏ ప్రాజెక్టు చేపట్టినా అది తమ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలుగు రాష్ట్రాలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు తుంగ నుంచి 17.4 టీఎంసీల నీటిని భద్రానది ఎత్తి పోసి, భద్రా నుంచి 29.9 టీ ఎం సి ల తో అప్పర్ భద్ర ఎత్తిపోతల పథకం ఇప్పుడు కర్ణాటక సిద్ధం చేసింది.

** కర్ణాటక చెబుతున్నట్లు కేవలం చెరువులు నింపడానికే అని అంటున్నా, దానికే 10.86 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అంచనా. మరో 19 టీఎంసీల తో 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెబుతున్న మాట ఆచరణలో సాధ్యం కాదు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఆ నీటితో డ్రిప్ ఇరిగేషన్ చేస్తామని మాటలు చెబుతోంది. అయితే దీనిలో కీలకమైన అంశం ఏమిటంటే తుంగ నుంచి ఎంత నీటిని మళ్లించి, అపర భద్రా లో ఎంత నీటిని వినియోగించే దాని మీద ఎలాంటి పర్యవేక్షణ ఉండదు. దీంతో కర్ణాటక ఇష్టానుసారం తుంగ నుంచి నీటిని ఎత్తిపోసుకుంటుంది.

** అప్పర్ భద్ర ప్రాజెక్టు ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయింది. మరి ఈ సమయంలో ఎత్తిపోతల ప్రతిపాదన ఎందుకు తెచ్చారని కేంద్ర జల సంఘం చైర్మన్ ప్రశ్నించగా, ప్రాజెక్టు స్వరూపం మారిందని నీటి వినియోగం సహా అన్ని అంశాల్లో మార్పులు వచ్చాయని ప్రాజెక్టు అధికారులు సమాచారం ఇచ్చారు. రూపాయి ఖర్చు పెడితే 1.024 పైసలు మాత్రమే ప్రాజెక్టులో లాభం అని సాగునీటి రంగ నిపుణులు చెప్పడం కూడా సిడబ్ల్యుసి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొత్తం తుంగభద్ర ప్రాజెక్టు పై ఇది ఎలా ప్రభావం పడుతుంది అన్న దాని మీద సవివర నివేదిక అందించాలని ఆదేశించింది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక ప్రతిపాదనను కేంద్ర జలసంఘం ఆమోదిస్తే కనుక తెలుగు రాష్ట్రాలకు భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవు.

author avatar
Comrade CHE

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju