Subscribe for notification

జల ధారకు బలి పేదోడు…!! పోలవరం విషయంలో కథలెన్నో

Share

 

 

ఓ చోట స్థలం కొన్నాం…. ఇల్లు కట్టుకోవాలంటే దాన్ని చాలా చదును చేయాలి… అక్కడున్న ముళ్ల కంపలు తొలగించాలి.. అబ్బో బోలెడు పని ఉంది… అప్పుడేం చేస్తాం? స్థలాన్ని చదును చేసి, అక్కడున్న ముళ్ల కంపలు తొలగించి ఇంటి నిర్మాణానికి పునాది వేస్తాం… ఇది కదా ప్రాసెస్…. ఒక ఇంటి నిర్మాణం విషయంలో ఇన్ని ఆలోచించి నిర్మాణం చేస్తాము కదా మరి పోలవరం విషయంలో మాత్రం దీనికి విభిన్నమైన పరిస్థితి ఉంది…. పోలవరం నిర్మాణ స్థలం, రిజర్వాయర్ ముంపు ప్రాంతాల్లో గ్రామస్తులు గ్రామాలు ఉండగానే ప్రధాన డ్యామ్ పనులు సాగుతున్నాయి. అంటే మనం ఇంతకుముందు చెబుతున్నట్లు స్థలంలో పిచ్చిమొక్కలు చదును చేయకుండానే ఇంటి నిర్మాణం చేపడుతున్న మన్న మాట…

నిర్వాసితుల మాటేమిటి?

**పోలవరం నిర్మాణం ఓ బృహత్తర కార్యం. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఇది ఆంధ్రప్రదేశ్కు పట్టుగొమ్మగా నిలుస్తుంది. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాజెక్టు ను విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. దీనికి సంబంధించిన నిధులు పైన ఉన్న వివాదం కాస్త మొన్న తొలగింది. 2018 19 అంచనాల మేరకు 55 వేల కోట్ల రూపాయలను కేంద్ర జల శక్తి శాఖ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇవన్నీ ప్రాజెక్టు నిర్మాణంలో శుభ పరిణామాలే. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంలో గేట్లను బిగిస్తున్నారు. స్పిల్ వే నిర్మాణ పనులు బుధవారం నుంచి మొదలయ్యాయి. 2022 ఖరీఫ్ నాటికి ఎలాగైనా పోలవరం ద్వారా నీళ్లు ఇచ్చి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని జగన్ ముందుకు వెళుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ ప్రాజెక్టు నిర్మాణం ముంపు గ్రామాల పరిస్థితి ఏమిటి వాళ్లకు ప్రభుత్వం చేసిందంత?? అసలు నిర్వాసితుల సమస్యను ఎంత వరకు బహిష్కరించారు అన్నది చూస్తే అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి.

ఎక్కడ తరలింపు!!

పోలవరం నిర్మాణంలో భాగంగా సుమారు 373 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా వేశారు. ఇక్కడ లక్ష 5000 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయని వారికి తగిన నష్టపరిహారం అందించి పూర్తి పునరావాసం కల్పించే అక్కడి నుంచి తరలించిన తర్వాత ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలి అనుకున్నరు.
** అయితే తర్వాత పునరావసం పనులు మొత్తం అటకెక్కాయి. కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి చూపిస్తే ఓట్లు రాలుతాయి అనే కాలంలో రాజకీయ పార్టీలు మొదట పోలవరం నిర్మాణానికి అడుగులు వేసాయి. అసలు ప్రాజెక్టు ముంపు ప్రాంతం లోని వారిని తరలించకుండా నిర్మాణానికి వెళ్లడం లో రాజకీయ లబ్ది దాగుంది.
** వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టు ముంపులో ఉండే 17వందల 720 కుటుంబాలను అక్కడినుంచి వెంటనే తరలించాలి. వీరికి తగిన కాలనీలు నిర్మించి వేరే దగ్గర తగిన పునరావాసం కల్పించాలి. అక్కడ అన్ని సదుపాయాలను కల్పించడంతోపాటు వీరికి జీవనభృతి ని ప్రభుత్వం అందించాలి. వీరికి ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని కాలనీలు అనుకున్నా తరలింపు మాత్రం జరగలేదు. కాలనీలు నిర్మాణం నత్తనడకన సాగడంతో ఇప్పటికీ కనీసం సగం మందిని కూడా తరలించ లేకపోయారు.
** ఇప్పుడు గోదావరి దశను మార్చేందుకు కాపర్ డ్యాం నిర్మాణం 41 మీటర్ల ఎత్తులో చేస్తే కనుక గోదావరికి ఏమాత్రం వరదలు వచ్చినా మొత్తం గ్రామాల నీ పిల్లజల్లాతో సహా కొట్టుకుపోతాయి. గత ఏప్రిల్లో కాపర్ డ్యామ్ నిర్మాణం కాస్త చేసిన దానికి గోదావరి దశ వారీ దేవీపట్నం మండలం మొత్తం సుమారు ముప్పై రోజుల వరకు నీటిలోనే నాని పోయింది. ఇప్పుడు కాఫార్ డ్యాం ను నిర్మించి, స్పిల్ వే మీదుగా నీళ్లను మళ్లించిన.. కింద ఉన్న 115 గ్రామాలకు ముంపు తప్పదు. మొదట వారినైనా కనీసం తరలిస్తే నే ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు వేయవచ్చు. లేకుంటే మళ్లీ ప్రాజెక్టు నిర్మాణంలో పేదవాడి జలసమాధి అయ్యే అవకాశం ఉంటుంది.


** పునరావాస కాలనీలు నిర్మాణం విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల పోలవరం అథారిటీ కౌన్సిల్ చైర్మన్ చంద్రశేఖర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల పునరావాస కాలనీల్లో పర్యటించిన ఆయన ఇవేమి వసతులు ఇవేమి తీరు అంటూ అధికారులను నిలదీశారు. అయితే కరోనా ప్రభావం వల్ల నిర్మాణాలు ఆగిపోయాయని అధికారులు సర్ది చెప్పినా చంద్రశేఖర్ మాత్రం అక్కడ జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేయలేదు సరికదా.. ఇలా అయితే ప్రాజెక్టు నిర్మాణం మొత్తం ఆపదలో పడుతుందని వ్యాఖ్యానించారు..
** పోలవరం తొలిదశలో తరలించాల్సిన 17760 కుటుంబాలకు సంబంధించి… పునరావాస కాలనీలు వసతులు కల్పించేందుకు సుమారు 3500 కోట్లు అవసరం అవుతుందని అంచనా. వీటిని ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలి. పశ్చిమ గోదావరిలో 33 కాల నీలు తూర్పుగోదావరిలో 16 కాలనీలు వీరికోసం కడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ గిరిజన సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ రహదారులు భవనాల శాఖ ఇలా నాలుగు శాఖలు కలిపి పునరావాస కాలనీల్లో నిర్మాణ పనులు పంచుకున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడం లేదు శాఖల సమన్వయం లేకపోవడం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించక పోవడంతో పనుల్లో మూడోవంతు సైతం ముందుకు సాగలేదు. దీంతో అసలు పోలవరం నిర్మాణం విషయంలో పునరావాస మీద ముందు ఎందుకు దృష్టి పెట్టలేదు అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది.
** గండికోట రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ఇలాంటి అనుభవాలు ప్రభుత్వానికి ఎదురయ్యాయి. పునరావాసం ముందు చేపట్టకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయడంతో అక్కడ ఎన్నో అభాగ్యులు జీవితాలు ఇప్పటికీ అతీగతీ లేకుండా సాగుతున్నాయి. వందల కుటుంబాలు ముంపుకు గురైన వారికి నష్టపరిహారం పునరావాసం కల్పించడం ప్రభుత్వం ఇప్పటికీ పై చూపులు చూస్తోంది. అలాంటి పరిస్థితి పోలవరానికి వస్తే మాత్రం కొన్ని వేల కుటుంబాలు కొన్ని లక్షల జీవితాలు తలకిందులు అవ్వడం ఖాయం.


Share
Comrade CHE

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

2 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

32 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

1 hour ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

1 hour ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago