యావత్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. ఈ మొక్క వలన అనేక లాభాలు ఉన్నాయి. ఈ మొక్క కేవలం 15 నుంచీ 20 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. అలాగే ఈ మొక్కకు 6 నుంచీ 10 ఆకులు మరియు ఒకటీ లేదా రెండు పూలు ఉంటాయి. లిలాక్ పర్పుల్ కలర్లో చూడగానే ఎంతగానో ఆకట్టుకుంటుంది కుంకుమ పువ్వు మొక్క. ఇటీవల జరిగిన పరిశోధనలలో ఆకలిని చంపేసేందుకు కుంకుమ పువ్వు ఉపయోగపడుతుందని తేలింది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది సరైనది గా చెప్పవచ్చు.
సాధారణంగా కుంకుమ పువ్వును ఎక్కువగా మాంసాహారాలలో వాడుతుంటాం. చికెన్, మటన్, రైస్ తో పాటుగా లిక్కర్స్ లో కూడా కుంకుమ పువ్వుని వాడుతుంటారు. అంతేకాకుండా కొన్ని రకాల డిషెస్‌కి కలర్ కోసం ఈ కుంకుమ పువ్వుని నీళ్ళల్లో కలిపి పైపైన చల్లుతారు. ప్రస్తుతం దీనిని కాస్మొటిక్స్‌లో కూడా వాడుతున్నారు. జ్వరాలు, మిలాంఖోలియా వంటి వాటికి కూడా ఔషధాల్లో దీన్ని బాగానే ఉపయోగిస్తున్నారు. మరొక విషయం ఏమిటంటే చైనా, టిబెట్‌లో తయారయ్యే మందులలో కూడా ఈ కుంకుమ పువ్వును ఎక్కువగా వాడుతున్నారు.
చాలా మంది బరువు తగ్గదానికి సడెన్‌గా ఆహారం మానేస్తుంటారు. అలా చెయ్యడం వలన శరీరానికి పోషకాల సరిగ్గా లభించవు. రోజూ ఆహారంలో కొంచెం కుంకుమ పువ్వు ను తీసుకోవడం వల్ల ఆకలి మందగిస్తుంది. ఆహారాన్ని కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండిన ఫీల్ కలిగి చాలు అనిపిస్తుంది. అందువల్ల ఇంకేమీ తినాలని అనిపించదు. ఇందుకు గల కారణం, కుంకుమ పువ్వు సెరెటోనిన్ పై ప్రభావం చూపుతుంది. ఆకలికీ ఈ సెరెటోనిన్కీ చాలా దగ్గర సంబంధం ఉంది. రోజూవారి ఆహారంలో కొంచెం కుంకుమ పువ్వును తీసుకుంటే చాలా త్వరగా ఆటోమేటిక్ గా బరువు తగ్గొచ్చు…