Couples: పడక గది ఈ దిశలో
కొత్తగా పెళ్లైనవారు సుఖ సంతోషాలతో జీవితం గడపాలంటే వాస్తు విషయం లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు తెలియచేస్తున్నారు. ఎటు పక్క పడక గాడి ఉండాలి, ఈ రంగు కర్టెన్లు ఎక్కువగా వాడాలి? గోడకు ఎటువంటి పెయింటింగ్ పెట్టుకోవాలి? ఇలాంటివి వాస్తు ప్రకారం చేస్తే… వైవాహిక జీవితం చాలా బాగుంటుందని సూచిస్తున్నారు. కొత్తగా పెళ్లి జరిగినవారి పడక గది తప్పనిసరిగా నైరుతీ దిశలో కానీ దక్షిణం, పశ్చిమ దిశలో ఉండాలి అని తెలియచేస్తున్నారు. ఇలా ఉంటే నూతన దంపతుల మధ్య ప్రేమ బాగుండడం తో పాటు వాళ్ల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇక రొమాన్స్ విషయానికి వస్తే అది హై రేంజ్లోజరుగుతుంటుంది.
తూర్పువైపు ఉన్న గోడకు
కొత్తగా పెళ్లైన వారు తమ ఇంటి లో మార్పులు చేసుకోవాలనుకుంటే పడకగది ఎట్టి పరిస్థితుల్లో పైన చెప్పిన దిశలోనే ఉండే విధం గా చూసుకోండి. అలాగే ఉత్తరదిశ , తూర్పు, ఈశాన్య దిశలో అసలు పడకగది పెట్టుకోకండి అని సూచిస్తున్నారు. పెళ్లైన వారు తమ పెళ్లి ఫొటోలను గదుల్లో అలంకరించుకుంటుంటారు. అలాంటి ఫొటోలను పడకగదిలో తూర్పువైపు ఉన్న గోడకు మాత్రమే ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ విధం గా చేస్తే వధూవరుల మధ్య ఒకరిపట్ల ఒకరికి అవగాహన పెరుగుతుంది. తూర్పు వైపు ఉండే గోడ నుంచి పాజిటివ్ ఎనర్జీవస్తుంటుంది.అలాగే పడక గదిలోకి ల్యాప్టాప్స్,ఛార్జర్లు, బుక్స్, ఫైల్స్ వంటివి రాకూడదు అని ఒక నియమం పెట్టుకోవాలి. వీటిని వేరే గదిలో ఉంచాలి తప్ప పడక గదిలోకి తీసుకురాకూడదు. కాదు కూడదు అని గదిలో పెట్టుకుంటే ఇక వారి కాపురం లో కల్లోలం తప్పదు అంటున్నారు నిపుణులు.కొత్తగా పెళ్లైన జంట తల దక్షిణంవైపు ఉండేలా చూసుకోవాలి.
Couples: పడకగదిలో
మంచం మీద నలుపు, బూడిద రంగు, గోధుమరంగు , క్రీమ్ కలర్ బెడ్ షీట్లు తలగడ కవర్లు, కర్టెన్లు, వాల్ పేపర్లు… ఇవి ఏవి కూడా ఆ రంగులో ఉండకుండా చూసుకోవాలి. బ్లూ, పింక్,ఎల్లో ఆరెంజ్, ఉండే విధం గా చూసుకోవాలి . పడక గదిలో ఉన్న మంచానికి అద్దం ఎట్టి పరిస్థితులలో ఉండకూడదు. పడకగదిలో వేరే ఇంకా ఏమైనా అద్దం ఉన్నా అది మంచం మీద పడుకున్నవారు కనబడకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అలా కనిపించే విధం గా ఉంటె దంపతులు అనారోగ్యాలకు గురవుతారు. ఇది కేవలం కొత్త దంపతులకు మాత్రమే కాదు… పాత దంపతులకు కూడా వర్తిస్తుంది. అలాగే వాడుకునే ఫర్నిచర్ కలప ది అయి ఉండాలి. బెడ్రూంలో ఫ్లవర్ వాజ్ ఉంచితే దాని ద్వారా వచ్చే సువాసన, పరిమళాలు,నవదంపతులకు స్వర్గం చూపిస్తాయి అని నిపుణులు తెలియచేస్తున్నారు.