నేడు మనీ ట్రాన్స్ ఫర్ సులభంగా జరిగిపోతూ ఉంటుంది. టెక్నాలజీల పరంగా ఆయా బ్యాంకులు వినియోగదారులకు సులభ మార్గాలను కల్పిస్తున్నాయి. తమ ఖాతాదారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ వారి ఆనందానికి కారణమవుతాయి. అయితే మనీ ట్రాన్సఫర్ ఆన్ లైన్ ద్వారా చాలా సులభంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ మనీ ట్రాన్సఫర్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఒకరికి పంపించాల్సిన మనీ మరొకరి వెళ్లాల్లే అవశాలు చాలానే ఉన్నాయి. మీరు పంపించాల్సిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.
అయితే మరీ ముఖ్యంగా బ్యాంకు వెళ్లి అకౌంట్ లో మనీని వేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇతరులకు కూడా ఆన్ లైన్ ద్వారా మనీని పంపేటప్పుడు వారి అకౌంట్ నెంబర్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక అకౌంట్ కు బదులుగా మరో అకౌంట్ కు డబ్బులు వెళ్లే అవకాశముంది. అందుకే ఆన్ లైన్ పేమెంట్ చేసేముందు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయితే ఇలా పొరపాటున ఒకరి అకౌంట్ కు బదులుగా మరో అకౌంట్ కు డబ్బులు వెళితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ను చదివి తెలుసుకోండి.
అనుకోకుండా మీరు ఒక అకౌంట్ కు వేసే మనీ వేరు అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయినట్టయితే వెంటనే బ్యాంకు అధికారులకు తెలపడం ఉత్తమం. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ డీటెల్స్ ను కూడా బ్యాంకు వారికి తెలియజేయాలి. అలాగే మీరు పొరపాటుపడి డబ్బులు పంపిన అకౌంట్ నెంబర్ ను కూడా బ్యాంక్ అధికారులకు తెలియజేయాలి. అలాగే మీరు డబ్బులు పంపినట్టు ప్రూఫ్స్ ను స్క్రీన్ షాట్ తీసుకోవడం ఉత్తమం. అయితే మీరు పంపిన అకౌంట్ గనక లేకపోతే వెంటనే మీ మనీ మీకు వెంటనే ట్రాన్స్ ఫర్ అవుతాయి. అయితే మీరు పంపిన డబ్బులు పంపిన బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే మీరు అన్ని ఫార్మాల్టీస్ ను పూర్తి చేయాలి.
అయితే మీరు పంపిన మనీ, మీ ఖాతా రెండూ ఒకే బ్యాంక్ కు సంబంధించినవైతే మీ డబ్బులు తొందరగానే మీకు వచ్చే అవకాశముంది. కాగా మీ బ్యాంక్ అకౌంట్, మీరు పంపిన డబ్బుల బ్యాంక్ అకౌంట్ వేరు వేరు అయితే మాత్రం మీరు పంపిన బ్యాంక్ కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు డబ్బులను కస్టమర్ల అనుమతులు లేకుండా వేరే బ్యాంక్ అకౌంట్ లోకి మనీని పంపించవు. కాబట్టి మీరు అలా జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. అలా చేసిన తర్వాత ఆ బ్యాంక్ కస్టమర్ కు తెలిపి ఆ డబ్బులను వెనక్కి పంపేస్తుంది. ఒకవేళ మీ డబ్బులను అవతలి వ్యక్తి ఇవ్వడానికి నిరాకరిస్తే మాత్రం పోలీసులకు తెలియజేయడం మంచిది.