NewsOrbit
న్యూస్

డ్రైవర్ లేడు, మనుషులు లేరు, ఎవరూ తోలట్లేదు, ట్రాక్టర్ మాత్రం గిర్రుగిర్రున తిరుగుతోంది… భయాందోళనలో ప్రజలు

ఏ వాహనాన్ని నడపాలన్నా డ్రైవర్ తప్పనిసరి. కార్ ల వరకూ ఆటోమేటెడ్ వి, డ్రైవర్ అవసరం లేనివి కొన్ని వచ్చాయి కానీ వాటిని వాడుతున్న వారు చాలా తక్కువే. ఇక ట్రాక్టర్ లకు అయితే ఇది కచ్చితంగా రాలేదు. డ్రైవర్ తప్పనిసరి. అయితే డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ ఆగకుండా బంతి ఆకారంలో తిరుగుతూనే ఉంది.

 

without driver tractor circles in warangal
without driver tractor circles in warangal

 

ఇది ఏదో కొన్ని సెకన్ల పాటు జరిగితే ఏమో అనుకోవచ్చు కానీ కొన్ని నిమిషాల పాటు ఎవరూ లేకపోయినా కానీ ట్రాక్టర్ అలా తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఓగ్లాపూర్ లో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రైతు ట్రాక్టర్ పై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా టైర్ పంక్చర్ అయినట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. దాంతో ఆ రైతు ట్రాక్టర్ పై నుండి దూకేసాడు. ఇక అక్కడి నుండి ఆ ట్రాక్టర్ ఆగకుండా పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా అతివేగంగా తిరగడం మొదలుపెట్టింది. ఈ సడెన్ సంఘటనతో ప్రజలు ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు.

 

 

అందరూ చూస్తుండగానే అది బంతి ఆకారంలో గిర్రుగిర్రున తిరగడం మొదలుపెట్టింది. అయితే అదే సమయంలో ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దేవులపల్లి విజయ్ కుమార్ అటుగా వెళ్తూ ఈ సంఘటనను చూసి ఆగారు. పంటపొలాలు, పక్కనే ఇళ్ళు ఉండడంతో ప్రమాదాన్ని ఊహించి ధైర్యం చేసి ట్రాక్టర్ వెనుకే పరిగెత్తి దాని మీదకెక్కి బ్రేక్ వేసి దాన్ని ఆపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మాజీ సర్పంచ్ ధైర్య సాహసాలకు అక్కడున్న వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N