NewsOrbit
న్యూస్

అత్యాచారం చేయలేదుట కానీ…!?

మహారాష్ట్ర సోషల్ అండ్ జస్టిస్ మినిస్టర్ ధనుంజయ్ ముండే పై అత్యాచారం ఆరోపణలు రావడంతో ఇన్నాళ్లు ఆయన గుట్టుగా సాగించిన వ్యవహారం బహిర్గతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించాలంటూ ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకీ ఆమె లేఖ రాశారు. ఓ రాష్ట్ర మంత్రిపై మరో రాష్ట్రంలో అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం అవుతోంది. 38 ఏళ్ల మహిళ రెండు రోజుల క్రితం మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే పై అత్యాచార ఆరోపణలు చేస్తూ ఒడిశాలోని అంధేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి ధనుంజయ్ స్పందించి మీడియాకు వివరణ ఇచ్చారు.

అత్యాచారం చేయలేదుట కానీ...!?
woman accuses maharashtra minister dhananjay munde of rape he claims they are in relationship

తనపై ఆ మహిళ చేస్తున్న ఆరోపణలు అవాస్థవమన్నారు. అయితే తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ సోదరితో తాను ఏడేళ్లుగా సహజీవనం చేశాననీ, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనీ తెలిపారు. ఇటీవల కాలంలో ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు కూడా అంగీకరించారనిీ ధనుంజయ్ చెప్పారు. అంతా బాగుంటుంది అనుకుంటున్న తరుణంలో సదరు అక్కా చెల్లిళ్లు డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారనీ, దీంతో తాను గత ఏడాది నవంబర్ నెలలోనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. అయితే స్వయంగా మంత్రే ఓ మహిళతో సంబంధం కొనసాగించానని వెల్లడించడంతో పాటు ఆమె సోదరే అత్యాచార ఆరోపణలు చేయడంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందించారు. ధనుంజయ్ ముండేను మంత్రి పదవి నుండి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ మేరకు ముఖ్యమంత్రికీ లేఖ రాశారు. అయితే దీనిపై సీఎం ఉద్దవ్ ఠాకరే ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మంత్రి ధనుంజయ్ ముండే తనను వివాహం చేసుకుంటానని నమ్మంచి పలు మార్లు అత్యాచారంకు పాల్పడ్డారని సదరు మహిళ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆ మహిళ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ మంత్రి ధనుంజయ్ తో బాధితురాలికి 1997 నుండి పరిచయం ఉందన్నారు. తొలుత బాలీవుడ్ లో సింగర్ గా అవకాశం ఇప్పిస్తానని పరిచయం పెంచుకున్నారని చెప్పారు. ఆ క్రమంలోనే 2008లో తొలిసారిగా ఆమెపై మంత్రి అత్యాచారం చేశారనీ, ఆ తరువాత కూడా పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 2019లో ఆ మహిళ వివాహం చేసుకోవాలని మంత్రి ధనుంజయ్ ను కోరగా అందుకు అంగీకరించకపోతే ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాని అన్నారు. మంత్రి ధనుంజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ చేయలేదనీ, దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలికి ఏమైనా జరిగితే అందుకు మంత్రి ధనుంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని బాధితురాలి తరపు న్యాయవాది అన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఇది కూడా చదవండి..బ్రేకింగ్: స్థానిక పోరు పిటిషన్‌ విచారణ వాయిదా

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N