“బాహుబలి” ని మించి పోతుందా..??

బాహుబలి” సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని షేక్ చేసి పడేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క సత్తా ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పింది. ఈ సినిమాతో రాజమౌళి మంచి గుర్తింపు దక్కించుకోవడం తెలిసిందే. ఒకానొక సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచ సినిమా ప్రముఖులు మాట్లాడాల్సి వస్తే బాలీవుడ్ పేరు ఎత్తేవారు.

RRR Breaks Baahubali 2 Pre-release Business Record: Film Tradeకానీ ఎప్పుడైతే బాహుబలి రిలీజ్ అయింధో ప్రపంచ సినిమా ప్రేమికులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రస్తుతం రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితిని కల్పించింది “బాహుబలి”. కాగా బాహుబలి తర్వాత ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “ఆర్ఆర్ఆర్” అని అందరికీ తెలుసు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మొట్టమొదటిసారి చేస్తున్న ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద భారీ మల్టీస్టారర్ సినిమాగా పేరు సంపాదించింది.

 

కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో రామ్ చరణ్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్ళు చెదిరిపోయే విధంగా బాహుబలి ని మించిపోయే రీతిలో చేయబోతున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. సినిమా కోసం ఎంత అయినా…, ఖర్చు పెట్టడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. దీంతో ప్రస్తుతం పలుకుతున్న రేట్ల ప్రకారం కచ్చితంగా “బాహుబలి” సినిమాని “ఆర్ఆర్ఆర్” అధిగమించడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వస్తుంది.