NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ అనే నేను… రూల్స్ ప్రకారం నడిపిస్తాను… ఏపీ ప్రజల కొత్త పాట

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపడం అందరం చూస్తాం. ప్రస్తుతం ఏపీ సర్కార్ రియాలిటీ లో అలాగే ఫాలో అయిపోతుంది. అదే పద్ధతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా వాహనదారులకు భారీ ఎత్తున జరిమానా విధించినట్లుగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఏఏ ఉల్లంఘన కి ఎంత మొత్తం చెల్లించాలి అన్న విషయానికి వస్తే….

 

చిన్న తప్పులే అనుకుంటే.. పెద్ద మొత్తాలే

మొదటిగా ట్రాఫిక్ లో బండి నడిపేటప్పుడు లైసెన్స్ ఆర్ సి చెకింగ్ కు ఎవరైనా అడ్డుపడితే 750 రూపాయలు జరిమానా విధిస్తారు. బండి కి సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన వారికి కూడా అంతే మొత్తం ఫైన్ వేస్తారు. అనుమతి లేని వారు బండి నడిపితే అంటే లైసెన్స్ లేని వారు రూ.5000 కట్టాల్సి ఉంటుంది. డ్రైవింగ్అర్హత వయస్సు లేని వారు వాహనం నడిపినా కూడా 5000 కట్టాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు ఇస్తే పదివేలు ఫైన్ పడుతుంది. రూల్స్ కు విరుద్ధంగా ఉంటే మరొక ఐదు వేలు పడుతుంది.

వార్నీ…. దీనికీ వేసేశారే….

ఇక పరిమితికి మించిన వేగం తో బండి నడిపితే వెయ్యి రూపాయలు ప్రమాదకరంగా లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే పదివేల రూపాయలు చమురు వదిలించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ,కారు రేసింగ్ లో పాల్గొన్న వారికి మొదటి సారి రూ. 5000 రెండవసారి రూ.10000 వదిలిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా పట్టుబడిన వారికి మొదటి సారి 2000 రెండో సారి ఐదు వేలు కట్టాలి. పర్మిట్ లేకుండా బండి నరికిన వారికి పదివేల రూపాయలు ఫైన్ పడడం ఖాయం.

కొసమెరుపు చూడరా…?

ఇక ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాన్ని పట్టుకుంటే ముందు 20 వేల రూపాయలు జరిమానా తర్వాత టన్నుకు 2000 కట్టవలసి ఉంటుంది. చెకింగ్ కోసం వెళ్లిన వారిని అడ్డుకుంటే 40 వేల రూపాయలు రంగు పడినట్లే. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వండి వాళ్ళు పదివేలు అపరాధ రుసుము చెల్లించాలి. అవసరం లేకపోయినా అదే పనిగా హార్న్ కొడితే ఒక వెయ్యి రూపాయలు రెండవసారి అలాగే చేస్తే 2000 కట్టాల్సిందే.

అసలు ఈ ఫైన్ లు చూస్తుంటేనే మధ్యతరగతి ప్రజలకు దిమ్మతిరిగిపోతుంది. దానికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఒక్కటే…. అసలు ఖచ్చితంగా అన్ని రూల్స్ పాటిస్తే…. పైన చెప్పిన ప్రతి సర్టిఫికెట్ లేదా అవసరమైన డాక్యుమెంట్స్ తెచ్చుకునేందుకు ఒక్క ఫైన్ అంత మొత్తంలో సగం కన్నా తక్కువ పడుతుంది. కాబట్టి రూల్స్ పాటించండి బాదుడు తప్పించుకోండి

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju