NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Localbody elections : మొదలు… వివాదాలు! తార స్థాయికి వివాదం!!

Localbody elections : మొదలు... వివాదాలు! తార స్థాయికి వివాదం!!

Localbody elections : రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఏర్పడిన వివాదం అగాథం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. అది రానురాను పెద్దదవుతుంది తప్ప… వివాదంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి అంశం వివాదాస్పదమే అవుతోంది. ఢీ అంటే ఢీ అంటూ ప్రతి విషయంలోనూ ఇటు అధికారులకు… సిబ్బందికి కొత్త తలనొప్పులు తీసుకువస్తుంది. ఎవరి పంతాలు వారివి… ఎవరి పట్టింపులు వారివి అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. ఫలితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు Localbody elections ముగిసేనాటికి ఈ గొడవలు ఈ స్థాయికి వెళ్తాయో ఎటు దారితీస్తాయో అన్నది అర్థం కానీ పరిస్థితిగా తయారు అయ్యింది.

localbody-elections-its-better-to-compramise-on-small-issues
localbody-elections-its-better-to-compramise-on-small-issues

 

 

Localbody elections :మళ్ళీ రగడ మొదలు!

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ పోస్టులో ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ అధికారం ఎన్నికల కమిషన్ కు ఉన్నప్పటికీ సాధారణ పరిపాలన విభాగంతో ఏ మాత్రం సమన్వయం చేసుకోకుండా ఆ అధికారి పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకోకుండా ఏకపక్షంగా రవిచంద్రను కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. మరో పక్క ప్రభుత్వం వెయిటింగ్ లో ఉన్న ముద్దాడ రవిచంద్ర ను ప్రభుత్వం అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా నియమిస్తూ జీవో ఇచ్చింది. ఆయనకు కొవిడ్ టీకాల పంపిణీ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏక కాలంలో ఇటు ప్రభుత్వం.. అటు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇవ్వడం.. దేనిని పాటించాలో తెలియక అధికారులు సతమతం అవుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న దృష్ట్యా పరిపాలనా విషయాల్లో ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవడం తప్పు లేదు కానీ… సాధారణ పరిపాలన నిర్వహించే ప్రభుత్వానికి కనీసం ఎలాంటి సమాచారం లేకుండా అధికారులను ఇష్టారీతిన బదిలీ చేస్తే పరిపాలనలో కొత్త అవంతరాలు వచ్చే అవకాశం ఉంది…
దీనిని ఇటు ప్రభుత్వం… అటు ఎన్నికల కమిషన్ గుర్తించాలి.

 

Localbody elections :ఫొటో మీద కూడా!!

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు కచ్చితంగా ఆయన పంచాయతీ రిజర్వేషన్ల ప్రకారం కుల దృవీకరణ పత్రం నామినేషన్ పత్రం తో జత చేయడం తప్పనిసరి. ఎన్నికల్లో పోటీ చేయాలని కొన్ని కుల ధ్రువీకరణ పత్రం కోసం తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే అత్యవసర కేటగిరిలో ఇస్తారు. తహసీల్దార్ జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రం మీద ముఖ్యమంత్రి జగన్ చిత్రం లేకుండా ఇవ్వాలని తాజాగా ఎన్నికల కమిషన్ సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాసింది. అసలు రాజకీయాలతో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటే ఎంత లేకపోతే ఎంత? ఆ చిత్రం ఎంతవరకూ ప్రభావితం చేస్తుంది? అసలు ఆ చిత్రం కూడా ప్రజల ప్రభావితం అయ్యే అవకాశం ఎందుకు ఉంటుంది. కేవలం నామినేషన్ పత్రాల తో జత చేసే కుల ధ్రువీకరణ పత్రం మీద ఎవరి ఫోటో ఉంటే ఏముంది? ఓటర్లను ప్రభావితం చేసే అంశాల మీద ఎన్నికల కమిషన్ దృష్టి పెడితే బాగుంటుంది అంతేతప్ప కావాలని ప్రతి విషయాన్ని వివాదం చేసే ప్రతి విషయంలో చిన్న చిన్న లోపాలు తప్పులు కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నికలు అయ్యే వరకు ఎల్లకాలం గొడవలు పెట్టుకుని ఇటు ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ ప్రతీదానికీ కుంటే ప్రజల వద్ద ఉన్న రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం పోవడం తప్ప… పెద్దగా సాధించేది ఏమీ ఉండదు అన్న విషయాన్ని ఇటు ఇరుపక్షాలూ గుర్తిస్తే మేలు.

 

author avatar
Comrade CHE

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju