NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

DMK : డీఎంకే మేనిఫెస్టో రిలీజ్ చేసిన స్టాలిన్..!!

Stalin released the DMK manifesto

DMK : త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో జరగబోయే ఎన్నికలలో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఎవరికి వారు ఎన్నికల వ్యూహాలతో ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని డీఎంకే పార్టీ ఉంది. ఈ క్రమంలో తాజాగా డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తాజాగా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు పది సంవత్సరాల తమిళనాడు భవిష్యత్ ఉద్దేశించి పార్టీ అధినేత స్టాలిన్ అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఏడు రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేశారు.

Stalin released the DMK manifesto
Stalin released the DMK manifesto

ఈ నేపథ్యంలో తమిళనాట యువతకు 75 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు వంతున కోటి మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల ప్రజలను పేదరికం నుండి కాపాడతామని తెలిపారు. అంత మాత్రమే కాక రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందించడంతోపాటు మంచినీటి వృధాను అరికడగతామని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యార్థులకు ప్రస్తుతం వస్తున్న స్కాలర్షిప్లను డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు.

 

అదేవిధంగా ఇంటిలో ఉన్న మహిళకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ అందించనున్నట్లు రేషన్ కార్డు ఉంటే చాలు నెలనెలా వెయ్యి రూపాయలు పెన్షన్ గృహానికి అందించనున్నట్లు స్టాలిన్ స్పష్టం చేశారు. అంత మాత్రమే కాక  రాష్ట్ర బడ్జెట్‌లో 1.9 శాతంగా ఉన్న ఎడ్యుకేషన్‌ బడ్జెట్‌ను 6 శాతానికి, 0.75 శాతం ఉన్న ఉన్న వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను 2 శాతానికి  పెంచుతామన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్ మరియు స్కూల్ నిర్మించడంతో పాటు దానికి తగ్గ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుచ్చిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో 10 ఇయర్స్‌ విజన్‌ అంటూ పార్టీ అధినేత స్టాలిన్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N