ముగిసిన కెసిఆర్ చండీయాగం

 

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్వహించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం  ముగిసింది. యాగంలో చివరిరోజైన శుక్రవారం నాడు పూర్ణాహుతి నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కెసిఆర్ దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

ఐదు రోజుల పాటు యాగాన్ని నిర్వహించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కెసిఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు.