NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కార్యకర్తగా మారిపోయారు..! నిమ్మగడ్డపై వైసీపీ ముప్పేట దాడి..!!

ఒక ఐఏఎస్ అధికారి. విశ్రాంత జీవితంలో ప్రశాంతత కోరుకుంటారు. ఉద్యోగ జీవితంలో మంచి స్మృతులను నెమరు వేసుకుంటారు. గౌరవార్థంగా రిటైర్ అవుతారు..! కానీ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ Nimmagadda Ramesh Kumar ఎందుకో కొరివి AP CM Ys Jagan Mohan Reddy తో తల గోక్కొన్నారు. ఆయన వైఖరి, వ్యవహారం తప్పో, ఒప్పో అనేది పక్కన పెడితే… ఏకపక్ష వైఖరి, మొండి పట్టుదల, సామజిక అభిమానం ఎక్కువై వివాదాల్లో దూరుతున్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ వ్యవహారంతో ఆయన కుర్చీ కథ క్లైమాక్స్ కి చేరినట్టే. “ఎలాగూ మార్చి నెలాఖరుకి రిటైర్ అయిపోతున్నారు కాబట్టి Andhra Pradesh స్థానిక ఎన్నికలు తన హయాంలోనే జరగాలి.. తనను కుర్చీ నుండి దింపేసిన ఈ YSR Congress Party ప్రభుత్వానికి తన పవర్ చూపించాలి” అనే ఏకైక లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్టు మాత్రం అర్ధమవుతుంది.

ఇక నిమ్మగడ్డ తీరుపై అటు ఉద్యోగ సంఘాల నేతలు, ఇటు అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మొన్న సాయంత్రం షెడ్యూల్ వచ్చినప్పటి నుండి వైసీపీ నేతలు అడపాదడపా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజారా ఈరోజు చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణ మోహన్ ఒక అడుగు ముందుకేశారు. “ఎన్నికల కమీషనర్ కుర్చీలో టీడీపీ కార్యకర్త కూర్చున్నారు” అంటూ తనదైన శైలిలో ధాటి పెంచారు. “కరోనా రెండో దశ వ్యాపిస్తున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వడం అనైతికమని.., ఈసీ ఏకపక్ష వైఖరికి ఇదే నిదర్శనమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకే నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా గ్రామాల్లో రెండు వర్గాలు ఉంటె పరోక్షంగా వారిని ప్రోత్సహించడమే అవుతుందని ఆమంచి పేర్కొన్నారు. తన సామజిక వర్గానికి, ఆ పార్టీకి లబ్ది చేకూర్చడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా చేస్తున్నారు” అంటూ దుయ్యబట్టారు.

నిన్న బాలినేని ఘాటు వ్యాఖ్యలు..!!

మంత్రి బాలినేని కూడా నిన్న సాయంత్రం నిమ్మగడ్డ తీరుపై ఘాటుగా మాట్లాడారు. “ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించారని మంత్రి తప్పుబట్టారు. నిమ్మగడ్డ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
* ఇప్పటికే వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా నిమ్మగడ్డ తీరుపై మండిపడ్డారు. తాజాగా ఆయన మరింత ఘాటైన ట్వీట్ చేసారు. “చంద్రబాబు ‘ఉస్కో’ అన్నప్పుడల్లా స్థానిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యం గురించి వాళ్లకే బాధ ఉండదు. కోడ్ పేరుతో సంక్షేమ పథకాలను అడ్డుకోవాలి. తిరుపతి ఎన్నికల తర్వాత పచ్చ పార్టీ అడ్రసు గల్లంతవుతుంది. అంతకు ముందే ఏదో ఒకటి చేయాలనే స్వామి భక్తి నిమ్మగడ్డది” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసారు.

* మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా నిమ్మగడ్డ వైఖరిని తప్పు పడుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో సంఘం అందరూ నిమ్మగడ్డ తీరుని తప్పు పడుతున్నారు. నేరుగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో కెరీర్ చివరి దశలో నిమ్మగడ్డ ఒక అప్రతిష్ఠని మూట గట్టుకుంటున్నారు అంటూ తటస్థ వర్గాల్లోనూ వ్యాఖ్యలు వస్తున్నాయి..!!

 

author avatar
Srinivas Manem

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju