NewsOrbit

Tag : ysjagangovernment

బిగ్ స్టోరీ

సెల్ఫ్ గోల్ వేసుకున్న నిమ్మగడ్డ… పవర్ మొత్తం జగన్ చేతిలోకి! 

siddhu
ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం  మరో కొత్త మలుపు తీసుకుంది. హైకోర్టు తీర్పు యొక్క హైలెట్స్ ను టీవీలు బ్రేకింగ్ న్యూస్ గా వేయగానే నిమ్మగడ్డ లో అత్యుత్సాహం కట్టలు తెంచుకుంది. కోర్టు తీర్పులకు సంబంధించి మామూలుగా టీవీల్లో పూర్తిగా చూపించరు. వారికి కావలసిన బ్రేకింగ్ పాయింట్స్ జనాలను ఆకర్షించేందుకు వేసుకొని అసలైన విషయాన్ని వివరించరు. అంతేకాకుండా అందరికన్నా ముందుగా తామే ఈ న్యూస్ జనాలకు చేరవేయాలని ప్రతి రిపోర్టర్ ఉన్న విషయాన్ని తమకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుని చెప్పేస్తుంటారు. సరే అసలు ఈ గొడవంతా ఎందుకు అంటే…. అసలు జడ్జి తన తీర్పులో ఏమి చెప్పారు అన్న విషయం కాపీ బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని బ్రేకింగ్ న్యూస్ రూపంలో వచ్చిన వెంటనే నిమ్మగడ్డ హుటాహుటిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి కి ఫోన్ చేసి హైదరాబాద్ లోని తన నివాసానికి వాహనాలను పంపమన్నారు. ఇంకా అక్కడితో ఆగాడా…? కోర్టు తీర్పు ప్రకారం తానే కమిషనర్ గా వస్తున్నట్లు జిల్లాలో అన్నింటికీ సర్కులర్ పంపమని ఆదేశించి పనిలో పనిగా తాను బాధ్యతలోకి దిగి పోయినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు. అంతేకాకుండా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమని ఆదేశించి…. అతనికి కొద్ది వ్యవధి కూడా ఇచ్చే అవకాశం లేదని హూంకరించాడు. ఇక ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనకరాజు వెంటనే తప్పుకోవాలని హుకుం జారీ చేసిన ఆయన పైన తతంగం అంతా పూర్తి చేసేసరికి సాయంత్రం అయింది. ఈ లోపల సాయంత్రం హైకోర్టు నుండి తీర్పు కాపీ వచ్చింది. అడ్వకేట్ జనరల్ శ్రీరాం దానిని మీడియా వారి ముందు పెట్టిన తర్వాత కానీ నిమ్మగడ్డకు అసలు విషయం బోధపడలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెబుతూ అవసరమైన ఏర్పాట్లు చేయమని కోర్టు చెప్పింది కానీ అందుకు ప్రభుత్వానికి ఎటువంటి గడువు విధించలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయమై హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో మళ్లీ కౌంటర్ పిటీషన్ వేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. కోర్టు వారు ఎటువంటి గడువు ఇవ్వలేదు కాబట్టి మిన్నగడ్డను పదవిలో నియమించేందుకు రెండు నెలల వ్యవధి ప్రభుత్వానికి ఇంకా ఉందని జస్ట్ శ్రీరామ్ వివరించారు. హై కోర్పు తీర్పుపై తాము సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు చెప్పగానే నిమ్మగడ్డతో పాటు చంద్రబాబు అండ్ కో మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. హై కోర్టులో కేసు ఓడిపోతే సుప్రింకోర్టుకు వెళ్ళటం మామూలే కదా ? అంతెందుకు హైకోర్టులో  నిమ్మగడ్డే ఓడిపోయుంటే సుప్రింకోర్టుకు వెళ్ళేవాడు కాదా ? ఇంత చిన్న లాజిక్ కూడా మిస్సయిన నిమ్మగడ్డ ఇపుడు గోల ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మరో వైపు జగన్ మాత్రం నిమ్మగడ్డ చూపిన అత్యుత్సహంతో ఇప్పుడు పవర్ అంతా తన చేతుల్లో ఉందని గ్రహించి సుప్రీం కోర్టుకు మరింత ఉత్సాహంతో వెళుతున్నాడు....