ఇకనుండి వాట్సప్ మీకు మెసేజ్ చేయబోతోంది.. విషయమేమంటే?

Share

యూజర్లు ఛాటింగ్ కోసం వాట్సప్ యాప్‌ని ఉపయోగిస్తారనే విషయం తెలిసినదే. ఇపుడు ప్రపంచంలో వాట్సప్ అంటే ఏమిటో తెలియని మనుషులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతమందిని అలరిస్తుంది కనుకే, వాట్సాప్ సోషల్ మీడియా యాప్స్ లలో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. తన యూజర్ల దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ నిత్యం ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనలో ఎవరన్నా ఎవరితోనైనా ఛాట్ చేయాలంటే వెంటనే వాట్సప్ ఓపెన్ చేసి ఛాటింగ్ చేయాల్సిందే. అంతలాగ ఇది జనాలను ఆకర్శించింది.

వెరిఫైడ్ ఛాట్:

ఇకపోతే, త్వరలో మీకు వాట్సప్ నుంచి కూడా మెసేజెస్ రానున్నాయి. వాట్సప్ త్వరలో అఫీషియల్ ఛాట్ ఏర్పాటు చేయనుంది. WABetaInfo సమాచారం ప్రకారం, ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. అనేక సంస్థలు వెరిఫైడ్ ఛాట్స్ ద్వారా యూజర్లకు, కస్టమర్లకు సేవలు అందిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వాట్సప్ కూడా వెరిఫైడ్ ఛాట్ తీసుకొస్తోంది. దీని వలన ప్రైవసీ, సేఫ్టీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అంటే వాట్సప్ ఏ ఫీచర్ రిలీజ్ చేయబోతోందో నేరుగా యూజర్లకు ఈ ఛాట్ ద్వారా మెసేజ్ చేస్తుంది.

ఫీచర్స్, అప్డేట్ లు డైరెక్ట్ గా మీకే:

అయితే ఇక్కడ యూజర్లు ఓ విషయాన్ని గమనించుకోవాలి. ఈ ఛాట్‌లో యూజర్లు రిప్లై ఇవ్వడానికి, మెసేజెస్ చేయడానికి మాత్రం అవకాశం ఉండదు. ఇది రీడ్ ఓన్లీ అకౌంట్ మాత్రమే అని తెలుసుకోవాలి. అంటే నోటిఫికేషన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. వాట్సప్ నుంచి కొత్తగా రాబోయే అప్‌డేట్స్, కొత్త ఫీచర్స్ గురించి ఇక్కడ సమాచారం అందుబాటులో ఉంటుంది అన్నమాట. ఇప్పటికే టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్‌లో ఈ ఫీచర్ వున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది కాబట్టి యూజర్లకు ఎప్పుడు రిలీజ్ అవుతుందనే సమాచారం ఇంకా తెలియాల్సి వుంది.


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

4 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago