మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు.
సీనియర్ హీరో వేను తొట్టెంపూడి, నాజర్, నరేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. 1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో నిజాయితీ గల ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో రవితేజ నటించారు. భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ఈ చిత్రం.. డిజాస్టర్ టాక్ ను ముటగట్టుకుంది.
టాక్ యావరేజ్‌గా ఉండటంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. టాక్ ఎలా ఉన్నా.. రవితేజకు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కనీసం రూ. 3 కోట్లు రాబడుతుందని భావించారు.. కానీ, రూ. 2.82 కోట్ల షేర్‌తో సరిపోట్టుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ. 3.42 కోట్ల షేర్‌ను వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా రామారావు టోటల్ కలెక్షన్స్‌ను ఓసారి గమనిస్తే..
నిజాం: 0.85 కోట్లు
సీడెడ్: 0.52 కోట్లు
ఉత్తరాంద్ర: 0.45 కోట్లు
తూర్పు: 0.31 కోట్లు
పశ్చిమ: 0.16 కోట్లు
గుంటూరు: 0.24 కోట్లు
కృష్ణ: 0.17 కోట్లు
నెల్లూరు: 0.12 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ= 2.82 కోట్లు(4.75కోట్లు~ గ్రాస్)
——————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.25 కోట్లు
ఓవర్సీస్: 0.35 కోట్లు
———————————-
టోటల్ వరల్డ్ వైడ్=3.42కోట్లు(5.95కోట్లు~ గ్రాస్)
———————————-
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 17 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 18 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగితోంది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే.. తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా రూ.14.58 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. కానీ, బ్యాడ్ టాక్ నేపథ్యంలో ఆ రేంజ్ వసూళ్లను రాబట్టడం కష్టమే అని.. రవితేజను ఈ సినిమా గట్టి దెబ్బ కొట్టడం కాయమని అంటున్నారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…