తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వెల్లడించారు. తనను చంపుతానంటూ ఓ పాకిస్థానీ వాట్సాప్ కాల్ లో బెదిరించినట్లు తెలిపారు. తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉన్నాయని బెదిరించినట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి రోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజా సింగ్ పేర్కొన్నారు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి, డీజీపీ, సీపీలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇస్లాం మతాన్ని కించపరస్తున్నందుకు తన గొంతు కోస్తామని తాజాగా రాత్రి 8 గంటల సమయంలో మరో వాట్సాప్ బెదిరింపు సందేశం తనకు పంపినట్లు తెలిపారు. తరచూ ఇలాంటి కాల్స్, మేసేజ్ లు వస్తుంటాయని పేర్కొన్నారు. వీటిపై ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు.

ఇంతకు ముందు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట నమోదు చేశారు. కొద్ది రోజులు జైలులో ఉండగా, ఆయనకు హైకోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై పీడీ చట్టాన్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. మరో పక్క తన ప్రాణాలకు ముప్పు ఉందని రాజాసింగ్ పలు మార్లు ఆరోపించారు. పోలీసులు తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనం పదే పదే మరమ్మత్తులకు గురి కావడంపై ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవలే ఆ వాహనాన్ని ప్రగతి భవన్ వద్ద వదిలివేసి వెళ్లారు రాజాసింగ్.
టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి ..గన్నవరంలో హైటెన్షన్